ఆర్ఆర్ఆర్ 2 టీజర్స్ లో ఈ 9 కామన్ పాయింట్స్ గమనించారా..?

ఆర్ఆర్ఆర్ 2 టీజర్స్ లో ఈ 9 కామన్ పాయింట్స్ గమనించారా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం మన ఇండస్ట్రీలో నడుస్తున్న టాపిక్ ఆర్ ఆర్ ఆర్ అప్డేట్. అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఎదురు చూడడానికి, ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయి.ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్రీమ్ కాంబినేషన్, రాజమౌళి దర్శకత్వం, తో సినిమా అభిమానుల్లో మొదలైన ఎగ్జైట్మెంట్, తర్వాత ఐదు భాషల్లోనూ  విడుదలైన మోషన్ పోస్టర్,ఆ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో, అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆర్ టీం నుండి వచ్చే అప్డేట్స్ తో ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం కొంచెం గా పెరుగుతూనే ఉంది.

Video Advertisement

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం అందరూ ఎదురు చూశారు. కానీ కరోనా కారణంగా అప్డేట్ విడుదల చేయలేక పోయారు. ఇటీవల సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది.దాంతో “అప్డేట్ ఎప్పుడా?” అనే ఆసక్తి కూడా అందరిలో మళ్ళీ మొదలైంది. అక్టోబర్ 22వ తేదీన, రామరాజు ఫర్ భీమ్ విడుదల చేయనున్నట్టు సినిమా బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

అక్టోబర్ 22వ తేదీ రానే వచ్చింది. టీజర్ కూడా విడుదలైంది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతంగా ఉంది. అయితే అంతకు ముందు వచ్చిన భీమ్ ఫర్ రామరాజు కి, ఇవాళ విడుదలైన రామరాజు ఫర్ భీమ్ కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అంతే కాకుండా అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో అనే చిన్న హింట్ కూడా టీజర్స్ ఇంకా పోస్టర్స్ ద్వారా మనకి ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందు నుంచి విడుదల చేసిన ప్రతి పోస్టర్ లో ఎన్టీఆర్ ని నీటితో, రామ్ చరణ్ ని నిప్పుతో పోలుస్తున్నట్టుగా డిజైన్ చేశారు. అందుకనే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ టీజర్ లో నిప్పుని పోలేలా కొంచెం ఆరెంజ్, బ్రౌన్ లాంటి కలర్ గ్రేడింగ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లో నీటిని పోలేలా కొంచెం బ్లూ కలర్ గ్రేడింగ్ వాడారు.

#1 ఈ రెండు ఫ్రేమ్స్ లో ఇద్దరి ఎమోషన్ దాదాపు ఒకటే లాగా ఉంది.

#2 ఈ ఫ్రేమ్స్ లో రామరాజు ఆయుధం, కొమరం భీమ్ ఆయుధం చూపించారు. #3 ఇందులో రామరాజు, కొమరం భీమ్ పాత్రల ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. #4 ఇందులో ఇద్దరి లెగ్ షాట్స్ చూపించారు. అందులో ఇద్దరికీ ఒక కాలు భూమి మీద ఉంటే ఇంకొక కాలు కొంచెం ఎత్తి అడుగు వేస్తున్నట్టు ఉంది. #5 ఇందులో ఇద్దరి ఐ షాట్ ఉంది. రామ రాజు ఐ షాట్ లో మనుషులు కనిపిస్తుంటే, కొమరం భీమ్ ఐ షాట్ లో రక్తపు చుక్క కనిపిస్తోంది. #6 ఇందులో కొమరం భీమ్ షాట్ లో నీటి ఉప్పెన ముందు కొమరం భీమ్ నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రామరాజు షాట్ లో రామ రాజు సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టు ఉంది. #7  కొమరం భీమ్ చేతిలో జల్ జంగల్ జమీన్ (నీళ్లు, అడవి, భూమి) అనే నినాదం రాసి ఉన్న జెండా ఉంది. రామ రాజు చేతిలో బందూక్ (తుపాకీ) ఉంది. #8 ఇక్కడ కొమరం భీమ్ బ్యాక్ గ్రౌండ్ అడవి ఉంటే, రామ రాజు బ్యాక్ గ్రౌండ్ పొలాలు లాగా ఉన్నాయి. షాట్స్ కూడా ఫోకస్ కొంచెం ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ మీద పడే లాగా తీశారు.#9 ఇందులో రాజమౌళి నేమ్ కార్డ్, రామ రాజు ఇంట్రడక్షన్ లో నిప్పుతో, కొమరం భీమ్ ఇంట్రడక్షన్ లో నీటితో వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు


End of Article

You may also like