చిరంజీవితో నటించిన ఈ ఇద్దరు హీరోయిన్స్ కి అదే జరిగిందిగా.. అంటే నెక్స్ట్ తమన్నా కూడా..?

చిరంజీవితో నటించిన ఈ ఇద్దరు హీరోయిన్స్ కి అదే జరిగిందిగా.. అంటే నెక్స్ట్ తమన్నా కూడా..?

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఎవ్వరు వదులుకోరు. మరోవైపు తోటి నటీనటులను ఆయన ఎంకరేజ్ చేసే విధానం కూడా అందరికి నచ్చేస్తూ ఉంటుంది. అయితే.. సినిమా ఇండస్ట్రీ అన్నాక చాలా మందికి చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి.

Video Advertisement

కాజల్ అగర్వాల్ తాను నటించే సినిమాలో ఎంట్రీ సీన్ లో వైట్ డ్రెస్ ఉంటె ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్ముతారు. అలాగే.. హీరోలు కూడా ముందు తమ ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటే హిట్ అవుతుంది అని నమ్మే వారు ఉంటారు.

chiru kajal 1

అలాగే ప్రేక్షకులకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ కాంబోలో సినిమా ఉంటె పక్కా హిట్ అవుతుంది అని, ఆ అక్షరంతో ఉన్న టైటిల్ ఉంటె సినిమా ఫట్ అవుతుంది లాంటి సెంటిమెంట్లు ఉండనే ఉంటాయి. అలాగే.. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కొత్త సెంటిమెంట్ మొదలవుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తో ఏ హీరోయిన్ అయినా నటిస్తే.. ఆమెకు వెంటనే పెళ్లి అయిపోయే ఛాన్స్ ఉంటుంది అని. వింతగా ఉన్నా.. కాజల్ అగర్వాల్, నయనతారల విషయంలో ఇదే జరిగింది.

తాజాగా.. తమన్నా భట్టియా విషయంలో కూడా ఇదే జరుగుతుందా అన్న సందేహం మొదలవుతోంది. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి “ఖైదీ నెంబర్ 150” లో నటించారు. ఆ తరువాత ఆచార్య సినిమా కు కూడా సైన్ చేసారు. ఖైదీ నెంబర్ 150 తరువాత పెళ్లి పీటలెక్కిన ఆమె ఆచార్య సినిమా రిలీజ్ టైంకి తల్లి కూడా అయ్యారు. అనుకోని కారణాల వలన ఆమె పాత్రను ఆచార్య సినిమాలో కట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా చిరు తో కలిసి “సైరా” సినిమాలో మొదటి సారి జోడి కట్టారు. ప్రస్తుతం ఆమె తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే.

chiru tamanna 3

తమన్నా కూడా చిరు సరసన “సైరా” లో నటించారు. అంతే కాకుండా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న “భోళా శంకర్” సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో తమన్నా భట్టియా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారేమో అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమన్నా కూడా పెళ్లి చేసేసుకుంటుందా అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అయిపోతున్నారు.


End of Article

You may also like