Ads
మరో రెండు రోజుల్లో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇప్పటికే 150 కోట్ల మంది భారతీయులు ఇండియా మరోసారి వరల్డ్ కప్ నెగ్గాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పలువురు 2011లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గినప్పటి సెంటిమెంట్లను తీసుకువచ్చి ఈసారి కూడా ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Video Advertisement
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ లకు ఇండియాలో ఉన్న సెలబ్రిటీలు అందరూ హాజరవుతారు. పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్లు వరల్డ్ కప్ కి హాజరై ఇండియన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మొన్న జరిగిన సెమీఫైనల్ మ్యచ్ కి కూడా బాలీవుడ్ స్టార్ తో పాటు టాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారు.
అహ్మదాబాద్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి కూడా చాలామంది స్టార్లు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరల్డ్ కప్ కి మహేష్ బాబు కి సంబంధం ఉంది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు. 2011లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గినపుడు ఫైనల్ మ్యాచ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ హల్చల్ చేస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కి కూడా మహేష్ బాబు హాజరయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మహేష్ బాబు హాజరైనప్పుడు ఇండియా కప్పు నెగ్గింది. ఇప్పుడు కూడా మహేష్ మ్యాచ్ కి హాజరైతే ఇండియా కప్పు కొట్టి తీరుతుంది అన్న సెంటిమెంట్ ను బలంగా స్ప్రెడ్ చేస్తున్నారు.
మహేష్ బాబు మ్యాచ్ కి వెళ్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే ఎవరు మ్యాచ్ కి వెళ్ళినా వెళ్లకపోయినా ఇండియాలో ఉండే 150 కోట్ల మంది మద్దతు భారత టీం కి కచ్చితంగా ఉంటుంది. అందరూ కూడా ఇండియా మ్యాచ్ నెగ్గాలని కోరుకుంటారు. సో సెంటిమెంట్లను పక్కనపెట్టి ఇండియా కప్పు గెలవాలని అందరం కోరుకుందాం. ఈ ఫైనల్ మ్యాచ్ కి ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు తెలిసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ ఈవెంట్స్ నిర్వహించనుంది. భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని కూడా ఫైనల్ మ్యాచ్ కి హాజరవుతున్నారని అంటున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా కప్పు నిండితే ఆ కిక్కే వేరు కదా.
Also Read:“పాయల్ రాజ్‌పుత్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article