మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. అలాగే దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి. వీరిద్దరూ ఒకే సినిమాతో పరిచయం అయ్యారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మంగళవారం. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : మంగళవారం
 • నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై.
 • నిర్మాత : స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం
 • దర్శకత్వం : అజయ్ భూపతి
 • సంగీతం : బి అజనీష్ లోక్‌నాథ్
 • విడుదల తేదీ : నవంబర్ 17, 2023

mangalavaaram movie review

స్టోరీ :

దాదాపు 80, 90 కాలాల్లో ఈ సినిమా కథ అంతా నడుస్తుంది. మహాలక్ష్మి పురం అనే ఒక ఊరు. ఆ ఊరిలో ఉంటే రవి, శైలజ (పాయల్) చిన్నప్పటినుండి స్నేహితులు. ఒక ప్రమాదంలో రవి చనిపోయాడు అనుకుని శైలజ బాధపడుతుంది. ఆ తర్వాత ప్రతి మంగళవారం ఆ ఊరిలో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లు గోడల మీద రాసి ఉంటాయి. ఆ మరుసటి రోజు అలా ఆ గోడ మీద పేర్లు రాసి ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించి కనిపిస్తూ ఉంటారు.

mangalavaaram movie review

ఆ ఊరికి మాయ (నందిత శ్వేత) అనే ఎస్ఐ కొత్తగా వస్తుంది. ఊరి ప్రజలు అందరూ కూడా ఆమె మీద అనుమానం పడతారు. వీరిపై మాత్రమే కాకుండా ఆ ఊరి పెద్ద జమీందారు అయిన ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ), అదే ఊరిలో ఉండే గురజ (శ్రీ తేజ్), వాసు (శ్రవణ్ రెడ్డి), కసిరాజు (అజయ్ ఘోష్), వీరందరూ మాత్రమే కాకుండా అదే ఊరిలో ఉండే ఆర్ఎంపి విశ్వనాథం (రవీంద్ర విజయ్) మీద కూడా అనుమానాలు వస్తాయి.

mangalavaaram movie review

ఇదంతా జరుగుతున్నప్పుడే, శైలజ జీవితంలోకి మదన్ (అజ్మల్ అమీర్) అనే ఒక వ్యక్తి వస్తాడు. శైలజ ఒక వింత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ ఏంటి? ఆ ఊరిలో చంపేసేది ఎవరు? శైలజకి ఈ సంఘటనలకి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఈ సమస్యలన్నీ ఎలా పరిష్కరించారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

mangalavaaram movie review

రివ్యూ :

ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. విరూపాక్ష సినిమా ఎవరు ఊహించని అంత పెద్ద హిట్ అవ్వడంతో, ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విరూపాక్ష సినిమాతో కొన్ని పోలికలు అయితే వచ్చాయి. కానీ జోనర్ ఒకటే అయినా కూడా సినిమాలకి పోలిక లేదు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, స్టోరీ పాయింట్ కొంచెం తెలిసినట్టే ఉంటుంది. కానీ మరి కొంచెం తెలియనట్టు కూడా ఉంటుంది.

mangalavaaram movie review

హీరోయిన్ కి ఉన్న అలాంటి వింత ఇబ్బంది గురించి ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించలేదు ఏమో. ఇలాంటి ఇబ్బంది నుండి బయటికి రావడానికి, తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి హీరోయిన్ తనని తానే ఇబ్బంది పెట్టుకోవడం అనేది ఈ సినిమాలో చూపించారు. సాధారణంగా ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మనుషులని ప్రేమిస్తే వారిని బయట మరొక ఉద్దేశంతో చూస్తూ ఉంటారు. కానీ అలా చేయడానికి వారు పడే ఇబ్బంది కారణం అని ఈ సినిమాలో చూపించారు.

mangalavaaram movie review

కానీ ప్రేక్షకులకి అది ఎంత వరకు కరెక్ట్ అవుతుంది అనేది సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. హీరోయిన్ పాయల్ ఒక పక్క గ్లామర్ గా కనిపిస్తూనే మరొక పక్క ఎమోషన్స్ కూడా చూపించారు. తన పాత్ర వరకు తను బానే చేశారు. మరొక ముఖ్య పాత్రలో నటించిన అజయ్ ఘోష్ సినిమాకి మరొక హైలైట్ అయ్యారు.

mangalavaaram movie review

మిగిలిన అందరూ నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. సినిమాకి అతి పెద్ద హైలైట్ విజువల్స్. శివేంద్ర దాశరధి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాంతార, విరూపాక్ష వంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన అజనీష్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. సినిమా స్టోరీ పాయింట్ బాగానే ఉన్నా కూడా సినిమా చాలా స్లోగా సాగుతుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ పెట్టారు. కానీ అసలు ఆ పోర్షన్ అంతా కూడా ఇంకా బాగా రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సినిమాకి ఇంకొక భాగం కూడా ఉంటుంది అని చూపించారు. కానీ చాలా వరకు సినిమా తెలిసిపోతూ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటులు
 • నిర్మాణ విలువలు
 • విజువల్స్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

 • స్లో గా సాగే స్క్రీన్ ప్లే
 • క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం

రేటింగ్ : 

3/5

ట్యాగ్ లైన్ :

గత సినిమా మహాసముద్రంతో పోలిస్తే ఈ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి ఇంప్రూవ్ అయ్యారు అనిపిస్తుంది. కానీ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో పోలిస్తే మాత్రం ఆ సినిమానే బాగుంది ఏమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి పోలికలు ఏమీ లేకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి, కథనం స్లోగా ఉన్న పర్వాలేదు, అసలు సినిమా ఏంటో చూద్దాం అనుకునే వారికి ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమా అవుతుంది. మొత్తానికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో మంగళవారం సినిమా ఒక మంచి ప్రయత్నంగా నిలుస్తుంది.

ALSO READ : సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం… ఇండస్ట్రీ చరిత్రనే మార్చేసింది..! అది ఏంటంటే..?