సీనియర్ నటుడు నందమూరి తారక రామా రావు గారు మరియు నాగేశ్వర రావు గారు కెరీర్స్ మంచి ఫామ్ లో ఉన్నపుడు ఎన్టీఆర్ గారు దర్శక నిర్మాతలకు మంచి సలహా ఒకటి ఇచ్చారు. దాని వల్ల ఆ కాలంలో చిత్ర పరిశ్రమలో ఒక మార్పు ఏర్పడింది.

Video Advertisement

 

ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ చిత్రాలు ప్రతి సంక్రాంతి పండగకి విడుదల అయ్యేవి.ఆ సమయంలో ఇద్దరు తమ సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలలో ఉన్నారు.అప్పుడు ఎన్టీఆర్ గారికి అనిపించింది ఏంటంటే వచ్చే కొద్దిపాటి ఆదాయం రెండు సినిమాల మధ్యలో సగం సంగం వచ్చేది.దాని వల్ల సినీ పరిశ్రమ కి భారీ నష్టం జరుగుతోంది అని భావించి ఆ సమయం లో గల నిర్మాతలను పిలిచి మన సినిమాను ముందస్తుగానే విడుదల చేద్దామా? అని ఒక చర్చ జరుపుకున్నారు.ఆ చర్చలో భాగంగా ఎన్టీఆర్ తమ సినిమాని డిసెంబర్ నెలలోనే విడుదల చేదాం అని ఒక నిర్ణయానికి వచ్చారు.

చర్చలలో ఈ నిర్ణయం తీసుకునే వరకు కూడా సినిమా హాల్స్ లో తక్కువ మంది ప్రేక్షకులు వచ్చేవారు.ఎందుకంటే అందరు సంక్రాంతి పండగ వాతావరణంలో హాల్స్ వంక ఎక్కువ మంది అడుగు పెట్టేవారు కాదు. కానీ ఒక్క సారి ఈ నిర్ణయం తరువాత డిసెంబర్ నెలలో ఎన్టీఆర్ వారి చిత్రాలు విడుదలకి వస్తే ప్రేక్షకులు అందరూ మాములు రోజులలో కూడా చూడటానికి వచ్చేవారు,కేవలం పండగల సీజన్ లో అప్పుడే కాకుండా.

 

ఈ నిర్ణయంని బట్టి వచ్చే ఆదరణ చూసి మిగిలిన నిర్మాతలు తమ సినిమాలను వేరే వేరే సీజన్ లో విడుదల చేసేవారు.తద్వారా సినీ పరిశ్రమలో చిత్రాల విడుదల కేవలం పండుగల అప్పుడే కాకుండా మిగిలిన సమయాలలో కూడా విడుదల చేసేవారు.ఈ సంచలన నిర్ణయం వల్ల సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు,కథానాయకులు, నటులు నూతనం గా పరిచయం అయ్యి ఇటు తెలుగులో అట్టు తమిళ్ లో చిత్రాలు తీయడం,విడుదల కావడం జరిగేది.ఈ అడుగు సినిమా రెవిన్యూని బాగా పెంచింది.దానికి పెద్ద కారణం ఎన్టీఆర్ గారు.