మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీ (2006), కన్నడ (2013), బెంగాలీ (2013) లో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో అని మొదట్లో కొంచెం సంకోచం ఉండేది కానీ తెలుగులో కూడా ఊహించని విధంగా స్పందన వచ్చింది.  మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ లో నాని, మూడవ సీజన్, ఇంకా నాలుగవ సీజన్ లో  నాగార్జున తమ హోస్టింగ్ తో బిగ్ బాస్ షోని జనాలకి ఇంకా చేరువయ్యేలా చేశారు.

కంటెస్టెంట్స్ విషయంలో కూడా సినిమా రంగానికి చెందిన వాళ్లు మాత్రమే కాకుండా సీరియల్స్, యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా కు చెందిన వాళ్లని కూడా ఎంపిక చేసుకుంటున్నారు. కంటెస్టెంట్స్ లో కొంతమంది మొదట కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత అందరూ కలిసి పోతారు. వాళ్లు ఇబ్బంది పడే వాటిలో ముఖ్యమైనది కమ్యూనికేషన్. కంటెస్టెంట్స్ లో చాలామందికి తెలుగు వచ్చు, కొంతమంది తెలుగు మాట్లాడలేరు కానీ అర్థం చేసుకోగలరు. కానీ బిగ్ బాస్ రూల్ ప్రకారం కంటెస్టెంట్స్ అందరూ కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. కాబట్టి పైన చెప్పినట్టుగా తెలుగు రాని కంటెస్టెంట్స్ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా మెల్లగా అధిగమిస్తారు. అలా తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న తెలుగు రాని, లేదా పూర్తిగా తెలుగులో మాట్లాడటానికి ఇబ్బంది పడిన కంటెస్టెంట్స్ వీరే.

#1 దీక్ష పంత్

#2 ముమైత్ ఖాన్

#3 పూజా రామచంద్రన్

#4.సూర్య కిరణ్

#5. మోనాల్ గజ్జర్

#6. అమ్మ రాజశేఖర్