Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని కూడా పిలుస్తారు.

Video Advertisement

అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌తో అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాడు. అల్లు అర్జున్ ఈమధ్య స్వెట్‌షర్ట్‌ ధరించి కనిపించాడు. అయితే చాలా మంది నెటిజన్లు అల్లు అర్జున్ స్వెట్‌షర్ట్‌ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దాని ధరను చూసి నెటిజన్లు విస్తుపోయారు. ఎందుకంటే స్వెట్‌షర్ట్ ధర 75,196. అల్లు అర్జున్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతాడు. అతను పాల్గొనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ అయిన స్పెషల్ కాస్ట్యూమ్స్ కోసం భారీగా ఖర్చు పెడతాడు. తన స్టైల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేలా చూసుకుంటాడు.
allu arjunవిజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ గివెన్చీ స్వెట్‌షర్ట్ ధరించి కనిపించాడు. గివెన్‌చీ స్వెట్‌షర్ట్ ధర 65,000, అతని బూట్లు ధర సుమారు 53,000. ఇంకా ఫెండీ సన్ గ్లాసెస్ ధరించాడు. దీని ధర 25,000. మొత్తం మీద, ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ దుస్తులకు,మిగతా వాటికి కలిపి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. అల్లు అర్జున్ స్వెట్‌షర్ట్ మరియు బూట్ల ధరలు తెలుసుకుని అభిమానులు విస్తుపోయారు. దీని పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేసారు.అంతే కాకుండా తన లగ్జరీ లైఫ్, స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే గంగోత్రి,ఆర్య, దేశముదురు, DJ.. పుష్ప వరకు సూపర్ హిట్ సినిమాలతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా అతను బ్రాండెడ్ వస్తువులను వాడుతాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో రూ. 1.45 లక్షల విలువైన షూలు, రూ. 65,000 విలువైన టీ-షర్ట్, హైదరాబాద్ లో రాజభవన లాంటి బంగ్లా, రూ. 7 కోట్ల విలువైన సూపర్ ఖరీదైన వ్యానిటీ వ్యాన్, ఖరీదైన స్టైలిష్ కార్లు ఉన్నాయి.