Ads
పెళ్లి అనగానే ఎంత హడావుడి, బంధు మిత్రులు సందడి, పెద్ద ఎత్తున భోజనాలు, పట్టుచీరలు, ఆభరణాల ధగధగలు.. అబ్బో లక్షల్లో ఖర్చు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే కాబట్టి చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు.
Video Advertisement
మధ్యతరగతి వారే ఇలా అనుకుంటే నిత్యం లైమ్ లైట్ లో ఉండే సినీతారల పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పక్కర్లేదు. సెలబ్రెటీల పెళ్లి అంటే.. అబ్బో.. హడావుడి అంతా.. ఇంతా.. కాదు. వారు తమ పెళ్లి బట్టలకే ఎంతో ఖర్చు చేస్తారు. ఫేమస్ డిజైనర్లతో వారి పెళ్లి బట్టలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు.
ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..
#1 సోనమ్ కపూర్
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, బిసినెస్ మాన్ ఆనంద్ అహుజా ని వివాహం చేసుకున్నారు. తన వివాహానికి సోనమ్ కపూర్ ధరించిన లెహంగా విలువ 90 లక్షలు.
#2 ఐశ్వర్య రాయ్
స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ని 2007 లో వివాహం చేసుకున్నారు. ఇందులో ఐశ్వర్య ధరించిన చీర ఖరీదు 75 లక్షలు.
#3 శిల్పా శెట్టి
హీరోయిన్ శిల్పా శెట్టి, బిజినెస్ మన్ రాజ్ కుంద్రా ని 2009 లో వివాహం చేసుకున్నారు. తన వివాహానికి శిల్ప శెట్టి ధరించిన చీర విలువ 50 లక్షలు.
#4 అలియా భట్
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా- రణబీర్ కపూర్ వివాహం గతేడాది జరిగింది. అందులో ఆమె 50 లక్షల విలువైన చీర ధరించింది.
#5 అనుష్క శర్మ
క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ 2017 లో ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందులో అనుష్క ధరించిన లెహంగా ఇప్పటికీ హాట్ ఫేవరేట్. అయితే దాని విలువ 30 లక్షల రూపాయలు.
#6 ప్రియాంక చోప్రా
అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2018 లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వేడుక లో ప్రియాంక సబ్యసాచి లెహంగా ధరించారు. దాని విలువ 18 లక్షలు.
#7 కత్రినా కైఫ్
కత్రినా – విక్కీ పెళ్ళిలో కత్రినా ధరించిన లెహంగా విలువ 17 లక్షల రూపాయలు.
#8 దీపికా పదుకొనె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా, హీరో రణవీర్ పెళ్ళిలో ఆమె ధరించిన లెహంగా విలువ 13 లక్షలు.
#9 కియారా అద్వానీ
బాలీవుడ్ నటులు కియారా- సిద్దార్థ్ మల్హోత్రా తాజాగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళిలో కియారా మనీష్ మల్హోత్రా లెహంగా ని ధరించారు. దాని విలువ 12 లక్షల రూపాయలు.
#10 జెనీలియా
జెనీలియా – రితేష్ దేశముఖ్ పెళ్ళిలో జెనిలియా ధరించిన నీతా లుల్లా డిజైన్ చేసారు. దాని విలువ 17 లక్షల రూపాయలు.
#11 కరీనా కపూర్
సైఫ్ – కరీనా 2012 లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో కరీనా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగా ధరించారు. దాని ధర 50 లక్షలు.
#12 హన్సిక
హీరోయిన్ హన్సిక, బిసినెస్ మాన్ సోహైల్ కతూరియా ని వివాహం చేసుకున్నారు. అయితే ఆ వేడుకల్లో భాగం గా హన్సిక తన సంగీత్ కి ఫాల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన పింక్ లెహంగా ధరించారు. దాని విలువ 11 లక్షలు.
#13 కాజల్
బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లు ని హీరోయిన్ కాజల్ వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ఆమె ధరించిన లెహంగా విలువ 5 లక్షలు అని సమాచారం.
#14 జ్యోతిక
క్యూట్ కపుల్ సూర్య, జ్యోతిక వివాహ సమయం లో జ్యోతిక ధరించిన చీర విలువ 3 లక్షల రూపాయలు.
#15 నయనతార
దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది హీరోయిన్ నయనతార. పెళ్లి లో ఆమె ధరించిన రెడ్ కలర్ చీరని ముంబై లో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది నయన్. దాని విలువ 25 లక్షలు అని సమాచారం.
End of Article