Ads
సాధారణంగా మనకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవాలంటే కొన్ని కోరికలు ఉంటాయి. అమ్మాయి లేదా అబ్బాయి అందంగా ఉండాలి. లేదు అంటే చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండాలి లేదా ఎక్కువ సంపాదించే వాళ్ళు అయి ఉండాలి మొదలైనవి. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ దీన్ని చూశారంటే మీరు అస్సలు నవ్వాపుకోలేరు.
Video Advertisement
సాధారణంగా మనం ఈ మధ్యకాలంలో పెళ్లి కుదరాలంటే సులభంగా మ్యాట్రిమోనీ ద్వారా కుదుర్చుకోవడం జరుగుతోంది. లేదా న్యూస్ పేపర్ లో కూడా వరుడు కావలెను, వధువు కావలెను అని ప్రకటనలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇలా కూడా పెళ్లిళ్లు కుదురుతాయి. అయితే ఇలాంటి ఈ వార్త ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ అవుతోంది. న్యూస్ పేపర్ లో వచ్చిన ఈ వార్త చూసి అందరూ నవ్వుకుంటున్నారు. అయితే ఇంతకీ అసలు అందులో ఏముంది..?, ఎందుకు అంతలా నవ్వుకుంటున్నారు అనేది చూస్తే..
30 కి పైగా ఏళ్లు దాటి ఉండి షార్ట్ హెయిర్ ఉండి ముక్కు, చెవి పోగులు ఉండి.. విద్యావంతులు అయ్యి ఉన్న అమ్మాయికి వరుడు కావలెను అని అందులో ఉంది. అలానే క్యాపిటలిజానికి వ్యతిరేకంగా సామాజిక సంస్థలో పని చేస్తున్న అందమైన మహిళకి కాబోయే వరుడికి వంట వచ్చి ఉండాలి అని అందులో ఉంది. వరుడికి 25 నుంచి 28 ఏళ్ళ మధ్య వయసు ఉండి కనీసం ఇరవై ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉండాలని కండిషన్ పెట్టారు.
ఇవన్నీ బాగా ఉంటే మరొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే తిన్న తర్వాత తేన్పులు రాకూడదు మరియు గురకపెట్టకూడదు అని ఉంది. తాజాగా ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన ఈ ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ ప్రకటన సోదరుడు తన సోదరికి పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు.
End of Article