Ads
ఏదైనా ఒక వస్తువు, లేదా వ్యాపారం లాంటివి ప్రజల్లోకి వెళ్లాలి అంటే అన్నిటికంటే అవసరమైనది అడ్వర్టైజింగ్. తమ సంస్థని వాళ్ళు ఎంత బాగా ప్రెజెంట్ చేస్తే ప్రజలు కూడా అంత బాగా ఎట్రాక్ట్ అవుతారు. కానీ ఈ అడ్వర్టైజింగ్ కూడా జనాల్లోకి వెళ్లాలంటే అవసరమైనది క్రియేటివిటీ. అందుకే చాలా సంస్థలు చాలా డిఫరెంట్ క్రియేటివ్ ఐడియాలతో వాళ్ల గురించి చెప్తున్నారు. అందుకు ఉదాహరణ మనం రోజు టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్స్.
Video Advertisement
కొన్ని అడ్వటైజ్మెంట్స్ చివరి వరకు చూస్తే కానీ అది దేనికి సంబంధించినదో అర్థం కాదు. అంటే అది ఆ సంస్థ తమ ప్రోడక్ట్ ని ప్రజెంట్ చేసే స్టైల్. టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్స్ సంగతి ఇలా ఉంటే మామూలుగా బయట అడ్వర్టైజింగ్ ఇంకొక లెవెల్ లో ఉంది. సాధారణంగా మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు డబ్బులు రోడ్డు మీద పడిపోయి కనిపిస్తూనే ఉంటాయి.
ఒకవేళ అవి ఎక్కువ మొత్తం అయితే మనం తీసి ఆ డబ్బులు అక్కడ ఉన్న వారివి ఎవరివైనా అయ్యుండొచ్చు ఏమో అని చూస్తాం. దీన్నే కొన్ని సంస్థలు ప్రమోషన్ స్ట్రాటజీ లాగా వాడుకుంటున్నాయి. టెల్లి స్టోరీ అనే కేరళలోని ఒక రెస్టారెంట్, రెండు వేల రూపాయల నోట్ ని పోలి ఉన్న పాంప్లెట్స్ తయారుచేసి రోడ్డు మీద వేస్తున్నారు.
ఆ పాంప్లెట్ చూసి చాలా మంది కరెన్సీ నోట్ అనుకొని తీస్తున్నారు. ఇలా వీళ్లు ఒక్కరు మాత్రమే కాదు. ఇదే పద్ధతిని చాలా చోట్ల చాలా మంది అనుసరిస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమోట్ చేసే ఐడియా అయితే చాలా డిఫరెంట్ గా ఉంది కదా? ప్రస్తుతం ఈ పాంప్లెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article