అమీర్ పేట్ “మెట్రో” దగ్గర ఆ నోట్ దొరికింది…తెరిచి చూస్తే ట్విస్ట్.?

అమీర్ పేట్ “మెట్రో” దగ్గర ఆ నోట్ దొరికింది…తెరిచి చూస్తే ట్విస్ట్.?

by Mohana Priya

Ads

నేను మొన్న ఒక రోజు మధ్యాహ్నం సమయంలో అమీర్ పేట్ లో వెళ్తున్నాను. మెట్రో స్టేషన్ కి వెళ్తున్నప్పుడు దారిలో రోడ్డు మీద ఒక కరెన్సీ నోట్ పడిపోయి కనిపించింది. చూస్తే అది 2000 రూపాయల నోట్. అంత డబ్బులు ఎవరు పారేసుకున్నారో అనిపించింది. సరే. అక్కడ ఉన్న వాళ్ళది ఎవరిదైనా అయ్యుండొచ్చు ఏమో అని చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుదామని కిందపడి ఉన్న నోట్ ని చేతిలోకి తీసుకున్నాను.
ఎందుకో ఒక్కసారి అది ఇది నిజం నోటా? కాదా? ఎవరైనా కావాలని దొంగ నోట్ రోడ్డు మీద పడేసి ప్రాంక్ చేస్తున్నారా? అని చెక్  చేసుకుందాం అనిపించింది. ఒకసారి వెనక్కి తిప్పి చూశాను. నా అనుమానమే నిజమైంది. అది 2000 రూపాయల కరెన్సీ కాదు. అలా అని దొంగ నోట్ కూడా కాదు. అలా అని ఎవరూ ప్రాంక్ కూడా చేయట్లేదు. అసలు అది ఏంటంటే.
currency note promotion creativity

ఏదైనా ఒక వస్తువు, లేదా వ్యాపారం లాంటివి ప్రజల్లోకి వెళ్లాలి అంటే అన్నిటికంటే అవసరమైనది అడ్వర్టైజింగ్. తమ సంస్థని వాళ్ళు ఎంత బాగా ప్రెజెంట్ చేస్తే ప్రజలు కూడా అంత బాగా ఎట్రాక్ట్ అవుతారు. కానీ ఈ అడ్వర్టైజింగ్ కూడా జనాల్లోకి వెళ్లాలంటే అవసరమైనది క్రియేటివిటీ. అందుకే చాలా సంస్థలు చాలా డిఫరెంట్ క్రియేటివ్ ఐడియాలతో వాళ్ల గురించి చెప్తున్నారు. అందుకు ఉదాహరణ మనం రోజు టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్స్.

Video Advertisement

currency note promotion creativity

కొన్ని అడ్వటైజ్మెంట్స్ చివరి వరకు చూస్తే కానీ అది దేనికి సంబంధించినదో అర్థం కాదు. అంటే అది ఆ సంస్థ తమ ప్రోడక్ట్ ని ప్రజెంట్ చేసే స్టైల్. టీవీలో చూసే అడ్వర్టైజ్మెంట్స్ సంగతి ఇలా ఉంటే మామూలుగా బయట అడ్వర్టైజింగ్ ఇంకొక లెవెల్ లో ఉంది. సాధారణంగా మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు డబ్బులు రోడ్డు మీద పడిపోయి కనిపిస్తూనే ఉంటాయి.

currency note promotion creativity

representative image

ఒకవేళ అవి ఎక్కువ మొత్తం అయితే మనం తీసి ఆ డబ్బులు అక్కడ ఉన్న వారివి ఎవరివైనా అయ్యుండొచ్చు ఏమో అని చూస్తాం. దీన్నే కొన్ని సంస్థలు ప్రమోషన్ స్ట్రాటజీ లాగా వాడుకుంటున్నాయి. టెల్లి స్టోరీ అనే కేరళలోని ఒక రెస్టారెంట్, రెండు వేల రూపాయల నోట్ ని పోలి ఉన్న పాంప్లెట్స్ తయారుచేసి రోడ్డు మీద వేస్తున్నారు.

currency note promotion creativity

ఆ పాంప్లెట్ చూసి చాలా మంది కరెన్సీ నోట్ అనుకొని తీస్తున్నారు. ఇలా వీళ్లు ఒక్కరు మాత్రమే కాదు. ఇదే పద్ధతిని చాలా చోట్ల చాలా మంది అనుసరిస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమోట్ చేసే ఐడియా అయితే చాలా డిఫరెంట్ గా ఉంది కదా? ప్రస్తుతం ఈ పాంప్లెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. currency note promotion creativity


End of Article

You may also like