Daily Current Affairs in Telugu : కరెంట్ అఫైర్స్ 2023

Daily Current Affairs in Telugu : కరెంట్ అఫైర్స్ 2023

by Anudeep

Ads

Current Affairs is one of the most important sections in competitive exams such as Government Exams. APPSC, TSPSC, SI, PC, TET, DSC, GURUKUL, RRB, BANKING, UPSC, SSC, and Bank Exams by updating you with daily and monthly current affairs PDFs. We cover many topics, including politics, economics, business, science and technology, environment, sports, and culture. Today’s Current Affairs PDF creates an important news and events repository for better general awareness and a competitive edge in government exams like UPSC IAS, SSC CGL  Group D & JE, CHSL, RRB NTPC, and others where the current affairs section holds significant weightage.  your knowledge about social, economic, and political developments. The Telugu Adda website provides the latest Current affairs and news information from all around the world.

Video Advertisement

Daily current affairs in telugu

Daily current affairs in Telugu

ప్రభుత్వ ఉద్యోగం/పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా మరియు తెలుగు భాషలో కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి నమ్మదగిన మూలం కోసం చూస్తున్నారా .తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC &APPSC, గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వేకి ప్రిపరే అయ్యే అభ్యర్థుల కోసం రోజువారీ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ లభిస్తాయి.

Daily Current Affairs In Telugu

Daily current affairs in Telugu: 21st November 2023 Current affairs నవంబర్ 21 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

నటుడు-కామిక్ వీర్ దాస్ ఉత్తమ కామెడీ సిరీస్ విభాగంలో తన స్టాండ్-అప్ స్పెషల్ ”వీర్ దాస్: ల్యాండింగ్” కోసం అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారని నిర్వాహకులు తెలిపారు.

మేఘాలయలోని ఉమ్రోయ్‌లోని జాయింట్ ట్రైనింగ్ నోడ్ వద్ద భారత్ మరియు అమెరికా ప్రత్యేక దళాలు మంగళవారం సంయుక్త వ్యాయామం “వజ్ర ప్రహార్”ను ప్రారంభించాయి. US దళం 1వ స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ (SFG) నుండి సిబ్బంది ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఈస్టర్న్ కమాండ్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ సిబ్బంది నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్.

ఘోల్‌ ఫిష్’ను గుజరాత్ రాష్ట్ర చేపగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్‌లో ఆయనీ ప్రకటన చేశారు. భారత్‌లోని అతిపెద్ద చేపల్లో ఘోల్ చేప కూడా ఒకటి. గుజరాత్, మహారాష్ట్రలోని సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది.

మత్స్య సంపద యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు మత్స్య సంపదపై ఆధారపడిన ప్రజల జీవనోపాధికి తోడ్పడటానికి ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ మత్స్య దినోత్సవం 2023 యొక్క థీమ్ ‘సెలబ్రేటింగ్ ది వెల్త్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్’.

ఈ ఏడాది పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు. ఐఎమ్‌డీబీ (IMDb) విడుదల చేసిన ఈ లిస్ట్‌లో షారుక్‌ ఖాన్‌ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.టాప్2లో బాలీవుడ్ హీరోయిన్‌ అలియాభట్‌ నిలిచారు. అలాగే మూడో స్థానంలో దీపికా పదుకొణె ఉన్నారు. వీళ్లతో పాటు ‘జవాన్‌’లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న నయనతార, విజయ్‌ సేతుపతి కూడా టాప్ టెన్‌లో స్థానం సొంతం చేసుకున్నారు.

Daily current affairs in Telugu: 20th November 2023 Current affairs నవంబర్ 20 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

ప్రపంచ పైల్స్ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 20న జరుపుకుంటారు, సాధారణంగా పైల్స్ అని పిలువబడే హేమోరాయిడ్‌ల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్త చొరవగా ఉపయోగపడుతుంది-ఇది ప్రబలమైన ఇంకా తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడిన వైద్య పరిస్థితి ఆసన కాలువను ప్రభావితం చేస్తుంది.

గూఢచర్య ఉపగ్రహం మల్లిగ్యాంగ్‌-1ను ఉత్తర కొరియా మంగళవారం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆ దేశ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యవేక్షించారని తెలిపింది.

Daily current affairs in Telugu: 19th November 2023 Current affairs నవంబర్ 19 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. టీమిండియా రన్నరఫ్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీతోపాటు 4 మిలియన్ డాలర్ల పైజ్ మనీని గెలచుకుంది.

ప్రతి సంవత్సరం, నవంబర్ 19వ తేదీని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా (IMD) పాటిస్తారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనేది పురుషుల సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక ఆర్ధిక విజయాలను గుర్తించి, గౌరవించే రోజు.

ప్రతిష్ఠాత్మక ‘మిస్‌ యూనివర్స్‌’ (Miss Universe) కిరీటం ఈ ఏడాది నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ పలాసియోస్ (Sheynnis Palacios) ‘మిస్‌ యూనివర్స్‌ -2023’ టైటిల్‌ దక్కించుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel).. ఇక, ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌గా కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన మోరయా  విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

Daily current affairs in Telugu: 18th November 2023 Current affairs నవంబర్ 18 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.ఏపీ నిట్‌లో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్యుడు డాక్టర్‌ రఫీ మహ్మద్‌ ఇటీవల ముంబైలో ‘కొరోషన్‌ అవేర్‌నెస్‌’ అవార్డు అందుకున్నారు.

2. జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్‌ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్‌ మోషన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేస్తోంది.

3.కరాచీలోని నౌకా స్థావరంలో సీ గార్డియన్స్‌-3 (Sea Guardians-3) పేరుతో చైనా, పాకిస్థాన్‌లకు చెందిన నౌకాదళాలు విన్యాసాలు ప్రారంభించాయి

Daily current affairs in Telugu: 17th November 2023 Current affairs నవంబర్ 17 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.’వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్’ రెండో ఎడిషన్‌ను భారత్ నిర్వహించనుంది. భారత్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీ20 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ దక్షిణాది దేశాలతో పంచుకోవడంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ యొక్క మొదటి ఎడిషన్ ఈ సంవత్సరం జనవరిలో వర్చువల్ ఫార్మాట్‌లో భారతదేశం నిర్వహించింది.

జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ “ఎక్సర్‌సైజ్ మిత్ర శక్తి-2023” తొమ్మిదవ ఎడిషన్ ఈరోజు ఔంధ్ (పుణె)లో ప్రారంభమైంది.

స్పెయిన్‌ ప్రధానిగా పెడ్రో శాంచెజ్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా పార్లమెంట్‌ దిగువ సభలో ఓటింగ్‌ జరిగింది.మొత్తం 350 మంది సభ్యుల్లో 179 మంది పెడ్రోకు అనుకూలంగా ఓటు వేశారు.

Daily current affairs in Telugu: 16th November 2023 Current affairs నవంబర్ 16 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

 

అమెరికా, చైనా సంయుక్తంగా ఇటీవల ఒక సంచలనాత్మక వాతావరణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడంలో కీలకమైన దశను సూచిస్తూ, స్వచ్ఛమైన శక్తిని గణనీయంగా పెంచడం, శిలాజ ఇంధనాలను స్థానభ్రంశం చేయడం మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒప్పందం యొక్క ప్రాముఖ్యత.

దేశం మరియు యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని 12 దేశాలు 23 మే 2022న ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (IPEF)ని ప్రారంభించాయి. IPEF ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థితిస్థాపకత, స్థిరమైన అభివృద్ధి, సమగ్రత, ఆర్థిక విస్తరణ, న్యాయమైన చికిత్స మరియు పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి పాల్గొనే అన్ని దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచ GDPలో సమిష్టిగా 40% వాటా కలిగిన పన్నెండు ప్రారంభ భాగస్వాములతో బిడెన్ IPEFను ప్రారంభించాడు.

ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.  క్రికెట్ వరల్డ్ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 10 మ్యాచ్‌ల్లో 711 పరుగులతో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

వరల్డ్ ఫిలాసఫీ డే లేదా వరల్డ్ ఫిలాసఫీ డేని ప్రతి సంవత్సరం నవంబర్ మూడో గురువారం నాడు జరుపుకుంటారు, ఈసారి నవంబర్ 16న జరుపుకుంటున్నారు. 2005లో యునెస్కో భవిష్యత్ సమాజాన్ని రూపొందించడంలో తత్వశాస్త్రం యొక్క ముఖ్యమైన సహకారాన్ని గుర్తించడానికి ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.

 

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఇది 1977లో ప్రారంభించబడింది. జాతీయ పత్రికా దినోత్సవం 2023 యొక్క థీమ్ “కళాత్మక మేధస్సు యుగంలో మీడియా”

Daily current affairs in Telugu: 15th November 2023 Current affairs నవంబర్ 15 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.తాజాగా టేస్ట్‌ అట్లాస్‌ అనే సంస్థ ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్‌ జాబితాను విడుదల చేసింది.ప్రపంచంలోని బెస్ట్ 50 స్ట్రీట్ ఫుడ్స్లో 4 ఇండియన్ ఫుడ్స్క చోటు దక్కింది. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో చికెన్ టిక్కా 23 వ , దోస 31 వ ప్లేసు, పరోటా 44 వ , 49 వ ప్లేస్లో చాట్ దక్కించుకున్నాయి.

2.ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియాలో యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ – 547 మిలియన్స్, ఫేస్‌బుక్ – 449 మిలియన్స్, వాట్సాప్‌ 424 మిలియన్స్, టెలిగ్రామ్ -310 మిలియన్స్, ఫేస్‌బుక్ మెసెంజర్ – 210 మిలియన్స్ ఉన్నాయి

3.దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జి-20 సమ్మిట్‌లో అమితాబ్ కాంత్ 2014-2022లో భారతదేశంలో 2 బిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్‌సెట్‌లు తయారు చేయడం జరిగింది. 2023 నాటికి మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ సంఖ్య 27 కోట్లు దాటుతుందని స్పష్టం చేశారు. 2023లో భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో దాదాపు 100 శాతం మేడ్ ఇన్ ఇండియావేనని వెల్లడించారు. కాగా, గతేడాది ఈ సంఖ్య 98 శాతంగా ఉందన్నారు.

4.మ‌లేషియా వేదిక‌గా జ‌రిగే జూనియ‌ర్ హాకీ వ‌రల్డ్ క‌ప్‌లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు పాల్గొన‌నుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భార‌త జ‌ట్టుకు ఫార్వ‌ర్డ్ ప్లేయ‌ర్ ఉత్త‌మ్ సింగ్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. డిసెంబ‌ర్ 5 నుంచి 16వ తేదీ వ‌ర‌కు కౌలలంపూర్‌లో ఈ పోటీలు జ‌రుగ‌నున్నాయి.

5’జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 15న జరుపుకుంటారు

Daily current affairs in Telugu: 14th November 2023 Current affairs నవంబర్ 13 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.‘ఏఐ’(కృత్రిమ మేథ)  అన్న పదాన్ని 2023 వర్డ్‌ ఆఫ్‌ ఇయార్‌గా ఎంపికచేసింది.

2.వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రమైన నీటి కొరత కారణంగా అత్యధిక సంఖ్యలో పిల్లలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతంగా ఐక్యరాజ్యసమితి దక్షిణాసియాను గుర్తించింది.

3.భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో కలిసి సింథటిక్‌ ఎపర్చార్‌ రాడార్‌  మిషన్‌పై కలిసి పని చేస్తున్నట్లు నాసా(NASA)కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబోరేటరి డైరెక్టర్‌ లారీ లెషిన్‌ తెలిపారు.

4.భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కించుకున్నారు.

5.బాలల దినోత్సవాన్ని ‘బాల్ దివాస్’ అని కూడా పిలుస్తారు. దీన్ని భారతదేశంలో ప్రతి  సంవత్సరం నవంబర్ 14 న జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం మొదటి ప్రధాన మంత్రి  జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని స్మరించుకుంటుంది.

6. ఎత్తైన ప్రదేశాల్లో స్కైడైవింగ్‌తో ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ భారతీయ మహిళా స్కైడైవర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్‌ మహాజన్‌(41)  ఎవరెస్టు శిఖరం ముందు… 21,500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్‌ నుంచి సోమవారం కిందకు దుమికారు. కాలాపత్తర్‌లోని ఎత్తైన ప్రదేశం(17,444 అడుగులు)పై విజయవంతంగా ల్యాండయ్యారు. ప్రపంచంలోనే ఈ తరహా  సాహసోపేత చర్యతో అరుదైన రికార్డు సృష్టించారు.

Daily current affairs in Telugu: 13th November 2023 Current affairs నవంబర్ 13 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.శ్రీలంక ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచ బ్యాంకు $150 మిలియన్లను ఆమోదించింది.

2.బలమైన భూకంపాల కారణంగా ఐస్‌లాండ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  కేవలం 14 గంటల వ్యవధిలో రెక్జానెస్‌ ప్రాంతంలో 800 భూకంపాలు చోటు చేసుకున్నాయి.

3. దీపోత్సవంలో 22లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం.

4.ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్‌ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

5.  2025లో పాకిస్తాన్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి  వరల్డ్‌ కప్‌  2023 పాయింట్ల పట్టికలో  టాప్‌ -8  జట్లు  ఇండియా,  సౌతాఫ్రికా,  ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌ల వీటితో పాటు  పాయింట్ల పట్టికలో  ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ కూడా  అర్హత  సాధించాయి.

6.భార‌త మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. క్రికెట్‌కు విశేష సేవ‌లు అందించినందుకుగానూ వీరూకు ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌( ICC Hall of Fame)లో చోటు ద‌క్కింది.అత‌డితో పాటు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మాజీ కెప్టెన్ డ‌యానా ఎడుజీ(Diana Edulji), శ్రీ‌లంక లెజెండ్ అర‌వింద డిసిల్వా(Aravinda de Silva)లు ఈ గౌర‌వం ద‌క్కించుకున్నారు.

7.ప్రపంచంలోనే మొదటి చికెన్‌గున్యా వ్యాక్సిన్‌కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ‘Ixchiq’గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఫ్రెంచ్‌ బయోటెక్‌ కంపెనీ వాల్వేనా అభివృద్ధి చేసింది.

Daily current affairs in Telugu: 11th November 2023 Current affairs నవంబర్ 11 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.2023 నేషనల్ గేమ్స్‌లో మహారాష్ట్ర   71 స్వర్ణాలతో సహా 208 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది.

2.సైబర్ బాధిత దేశాలలో భారత్ టాప్ . 2021 నుంచి 2023 వరకు 278 శాతం పెరిగింది అని సింగపూర్ కి చెందిన ఒక సంస్థ వెల్లడించింది

3.ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఓ కీలక ఒప్పందం నుంచి రష్యా అధికారికంగా బయటకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖ  వెల్లడించింది.

4.అత్యధికంగా 73 ఏళ్ల 60 రోజులు నాయ్య వాదిగా పనిచేసి, ఏకంగా గిన్నిస్ రికార్డు కెక్కిన కేరళకు చెందిన   పి. బాలసుబ్రమణి య మీనన్

5.నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం.

6.ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 2023లో ఇప్పటివరకు వన్డేల్లో రోహిత్ 60 సిక్సర్లు చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్సర్లు , క్రిస్ గేల్ 2019లో  56 సిక్సర్లు , పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 48 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు

Daily current affairs in Telugu: 10th November 2023 Current affairs నవంబర్ 10 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ (TB) నివేదిక 2023ని విడుదల చేసింది, 2022లో ప్రపంచంలో అత్యధిక TB కేసులను భారతదేశం కలిగి ఉంది, 2.8 మిలియన్ TB కేసులు, ప్రపంచ భారంలో 27% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

2.వాతావరణ మార్పు సిరియా, ఇరాక్ మరియు ఇరాన్‌లలో మూడు సంవత్సరాల తీవ్ర కరువును గణనీయంగా పెంచిందని ఒక కొత్త నివేదిక వెల్లడించింది.

3.భారత్‌ ఆర్గానిక్స్ బ్రాండ్‌ ద్వారా ఆరు సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలను కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రారంభించారు.

4.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరాన్ని యునెస్కో ‘సిటీ ఆఫ్ మ్యూజిక్’గా ప్రకటించింది.

Daily current affairs in Telugu: 9th November 2023 Current affairs నవంబర్ 9 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.ఆదిత్య ఎల్‌1 సోలార్‌ ప్రోబ్‌ మిషన్‌లో ముఖ్యమైన మైలురాయి పూర్తయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ట్వీట్‌లో తెలిపింది.అత్యంత శక్తిమంతమైన సౌర జ్వాలను ఆదిత్య ఎల్‌1 ఎక్స్‌-రేలో బంధించింది. దీని తొలి పరిశీలన సమయం అక్టోబరు 29న 12.00 నుంచి 22.00. యూటీ మధ్యలో హై ఎనర్జీ ఎల్‌1 భూమిపై జీవాన్ని సౌర జ్వాలలు, ఇతర అంతరిక్ష వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి.

2.WMO | ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు ఏప్రిల్‌, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది.

3.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో ఐదేళ్లపాటు జాయింట్ డైరెక్టర్‌గా వీ చంద్రశేఖర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

4.భారత చెస్‌ కెరటాలు ఆర్‌. వైశాలి, విదిత్‌ గుజరాతి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టారు. ఈ ఇద్దరూ ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌లో టైటిళ్లు గెలిచారు.

5.యాక్సిస్ బ్యాంక్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (IRMA) భారతదేశంలో ఆర్థిక చేరిక మరియు అక్షరాస్యతను పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

6.ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేయబడిన గేజ్, MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ (ఎమర్జింగ్ మార్కెట్స్)లో చైనా అత్యధికంగా 30% వెయిటింగ్ కలిగి ఉంది.

7.నవంబర్ 9 న జాతీయ న్యాయ సేవలు గాజరుపుకుంటాము. 1995 నవంబర్ 9 న  న్యాయ సేవల చట్టం అమలులోకి వచ్చింది.

Daily current affairs in Telugu: 8th November 2023 Current affairs నవంబర్ 8 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1. వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్  లో  మ్యాక్స్ వెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో డబుల్ సెంచరీతో భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును కూడా మాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు

2.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్‌లో 12 GST సేవా కేంద్రాన్ని వాస్తవంగా ప్రారంభించారు

3.వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల నరైన్ 6 టెస్టులు, 65 వన్డేలు, 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్ తరఫున సునీల్ నరైన్ 165 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.

4.గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ అక్టోబర్ 2023లో ఒక నెలలో 16 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) కార్గోను హ్యాండిల్ చేసిన దేశంలోనే మొదటి ఓడరేవుగా అవతరించింది.

5.ఆంధ్రప్రదేశ్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా హరేంధిర ప్రసాద్ నియమితులయ్యారు.

6.ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని నవంబర్ 8న జరుపుకుంటారు

Daily current affairs in Telugu: 7th November 2023 Current affairs నవంబర్ 7 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత ప్రధాన మంత్రి వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ని అధికారికంగా ప్రారంభించారు.

2.ఐపీఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు

3.రాజ్‌కుమార్‌ హృదయ జ్యోతి యోజన‘ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తామని కర్ణాటక .

4.FIFA ప్రపంచ కప్ 2034కి  సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో ధృవీకరించారు

5.ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు ( 44 వికెట్లు ) తీసిన బౌలర్‌గా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిలిచాడు.

6.2025లో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ను బంగ్లాదేశ్ నిర్వహిస్తుంది .

7.శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైం ఔట్ అయిన  తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

Daily current affairs in Telugu: 6th November 2023 Current affairs నవంబర్ 6 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ అత్యధిక వన్డే  49వ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ  సమం చేశాడు.

2.ఏపీలో కులగణనకు కేబినెట్ ఆమోదం.

3.సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలగిన రష్యా

4.మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 4-0 గోల్స్ తో జపాను ని చిత్తు చేసింది

5.బంగ్లాదేశ్ ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతాదళం  వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది.కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెల  ను ఏర్పాటు చేసింది

Daily current affairs in Telugu: 5th November 2023 Current affairs నవంబర్ 5 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ – 1000 టోర్నీలో బోపన్న-ఎల్డెన్ ద్వయం రన్నరప్ గా నిలిచింది.

2.జాతీయ క్రీడల్లో ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల టెన్నిస్ ఈవెంట్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

3.భారత్, బంగ్లా సంయుక్తంగా త్రిపురలోని నిశ్చింతపూర్, గంగాసాగర్ ను బంగ్లాదేశ్ ని కలుపుతూ 65 కిలోమీటర్ల ఖుల్నా – మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్ మరియు  బంగ్లాలోని రామప్పర్లో ఉన్న మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్  ప్రాజెక్టులకు ప్రారంబించారు.

4.న్యూఢిల్లీలో గంగా ఉత్సవ్ ఆరవ ఎడిషన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి.

580 కోట్ల మంది భారతీయులకు ప్రతి నెలా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించే కేంద్ర ప్రభుత్వ పథకం మరో ఐదేళ్లపాటు పొడిగించబడుతుంది.

Daily current affairs in Telugu: 4th November 2023 Current affairs నవంబర్ 4 ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ గా ప్రధాని మోదీ తిరిగి ఎన్నిక

2.ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.

3. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఖరీఫ్లో ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు.

4. జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్ లో వృత్తి (45:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది

 5.అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ. ప్రకటించింది.

Daily current affairs in Telugu: 3rd November 2023 Current affairs నవంబర్ 3  ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1. 24 రేట్ల అత్యంత శక్తిమంతమైన  సూపర్ అణు బాంబును తయారు చేయనున్నట్టు అమెరికా ప్రకటించింది.

2.పెళ్లాడే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో, జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులో అంతర్భాగమనీ, అది మానవ హక్కు కూడానని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

3.ప్రపంచంలోనే అత్యధిక ఆర్ధిక సాంకేతిక (ఫిన్దక్) యూని కార్న్ సంస్థలున్న దేశాల్లో, 2023 ఏడాదికి భారత్కు మూడో స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్ లను ఈ విభా గంలో కలిగి ఉంది.

4. కోల్కతాలోని రాజ్‌భవన్‌లో ఉన్న “ట్రోన్ రూమ్” ని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్ పేరుకి మార్చారు.

5. తెలంగాణ లోని ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం నుంచి CCPT యుద్ద వాహనం విడుదల చేసారు

6.చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.

 

Daily current affairs in Telugu: 2nd November 2023 Current affairs ( నవంబర్ 1 వ ముఖ్యమైన  కరెంట్ అఫైర్స్‌)

1.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఇన్‌సైట్‌ల కోసం సర్వేలను ప్రారంభించింది.

2.కోజికోడ్‌ను యునెస్కో భారతదేశపు మొదటి ‘సాహిత్య నగరం’గా పేర్కొంది.

3.ఇండియన్ నేవీ IL 38 SD లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపసంహరించుకుంది

4.నవంబర్ 1న AI సేఫ్టీ సమ్మిట్ 2023ని UK నిర్వహించనుంది..

5.ఐ-ప్రోసెస్ సేవలను దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థగా చేయడానికి  ICICI బ్యాంక్ RBI అనుమతిని పొందింది.

Daily current affairs in Telugu: 1st November 2023 Current affairs

1.వందేభారత్‌ రైళ్ల తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ్‌ రైళ్లు వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్నాయి

2.ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 నా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు

3.క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 13.22 సెకన్లలో ముగించి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది.

4.నవంబర్‌లో నీటిపారుదలపై గ్లోబల్‌ మీట్‌ను విశాఖపట్నం నిర్వహించనుంది.

5.పశ్చిమ కనుమలలో కొత్త పుట్టగొడుగుల జాతులు కనుగొనబడ్డాయి.

6.గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో మహిళల 20 కి.మీ రేస్ వాక్ లో ప్రియాంక గోస్వామి కొత్త జాతీయ రికార్డు సృష్టించింది

Daily current affairs in Telugu: 31st October 2023 Current affairs

1.భారత్లో వాయు కాలుష్యం 2019లో ఏకంగా 16 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నట్లు లాన్సెట్ జర్నల్ నివేదిక వెల్లడించింది.

2.SBI బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెట్ దిగ్గజం ఎంఎస్  ధోనిని నియమించింది.

3.ప్రపంచవ్యాప్తంగా చూస్తే వ్యక్తుల సగటు జీవితకాలం 2.3 సంవత్సరాల మేర తరుగుపడుతోంది.

4. Paytm 37వ జాతీయ క్రీడలకు అధికారిక స్పాన్సర్‌గా మారింది.

5. భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ లను అసెంబ్లింగ్ చేయడం కోసం టాటా గ్రూపు ఓ ముఖ్యమైన అడుగేవేసింది.

Daily current affairs in Telugu: 30th October 2023 Current affairs

1.ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్ లోకి 2023 ప్రకారం  అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

Ans.భారతదేశము

2.పురుషుల జావెలిన్ ఎఫ్ 46 ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జార్ స్వర్ణంతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు..

3.రాజస్థాన్ ప్రభుత్వం ‘ఇస్టార్ట్ టాలెంట్ కనెక్ట్ పోర్టల్’ను ప్రారంభించింది…

4.మనోదర్పాన్ చొరవను ఇటీవల మానవ వనరుల అభివృద్ధిమంత్రిత్వ శాఖ  ప్రారంభించింది.

 

Daily current affairs in Telugu: 29th October 2023 Current affairs

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC &APPSC, గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వేకి ప్రిపరే అయ్యే అభ్యర్థుల కోసం రోజువారీ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ లభిస్తాయి

1.ప్రధానమంత్రి అను సుచిత్ జాతి అభ్యుదయ యోజన  ఎన్ని పథకాల విలీనం ద్వారా రూపొందించబడినది?
Ans.మూడు

2. స్విస్ వాచ్‌మేకర్ ‘రాడో’ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది

Ans. కత్రినా కైఫ్‌

3.లండన్ లో ప్రధానం చేసే ప్యారడే అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు
Ans. ఆరోగ్య స్వామి పాల్రాజ్

4.37వ నేషనల్ గేమ్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ అధికారం గా అక్టోబర్  26వ తేదీన ఎక్కడ ప్రారంభించారు?
Ans.గోవా

5.భారత మహిళల క్రికెట్ జట్టు చీప్ కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.
Ans.అమూల్ మజుందార్

 

 Stay Updated With The Latest  Daily Current Affairs


End of Article

You may also like