విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా దాస్ కా ధమ్కీ మరి కొద్ది రోజుల్లో విడుదల అవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించారు.
Video Advertisement
ఈ సినిమా పాటలు ఇటీవల విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు అని అర్థం అవుతోంది. సినిమా ట్రైలర్ చూసి చాలా మంది అంతకుముందు తెలుగులో విడుదలైన కొన్ని సినిమాల లాగా ఉంది అని అన్నారు. కానీ ఈ సినిమా రెండవ ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేశారు.
అది చూసిన తర్వాత చాలా మంది, “సినిమా చాలా కొత్తగా ఉంటుంది అనుకుంటా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. అయితే సినిమా సెన్సార్ టాక్ ఇదే అంటూ ప్రస్తుతం ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. ఈ సినిమా సెన్సార్ పనులు ఇటీవల పూర్తి చేసుకుంది ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.
అలాగే సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మామూలుగా నడుస్తుంది అని, కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని అంటున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకునే అవకాశం ఉంది అని అన్నారు. సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదల అవుతోంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే విశ్వక్ సేన్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం అయితే సినిమా టాక్ ఇదే అని వార్త వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.