ఓ వ్యక్తి వాచ్ మెన్ గా పని చేస్తూ బతుకు బండి లాగుతున్నాడు. చాలా పేదవాడు.అతనికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేశాడు. ఇప్పుడు మూడో కుమార్తె పెళ్లి చేసి తన బాధ్యతను నిలబెట్టుకోవాలనుకున్నాడు. తనకున్న స్తోమత లో పెళ్లి ఏర్పాట్లు చేశాడు.అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేశాడు.

Video Advertisement

ఆ కొత్తజంటను మనసారా దీవించాడు. ఆ తర్వాత కాసేపటికే ఉన్నట్టుండి కుప్పకూలాడు. హాస్పిటల్ కి తీసుకెళ్ళేలోపే కన్నుమూశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా మట్టెవాడ లోని వేణు రావు కాలనీ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

శనివారం రోజు పద్మశాలి కళ్యాణ మండపం లో తన మూడో కుమార్తె అయిన హారిక పెళ్లి అయ్యాక మండపం సమీపంలో కూర్చున్నా బొరిగం వెంకటరమణనర్సయ్య గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ తర్వాత కాసేపటికే మృతి చెందాడు. తండ్రి చనిపోయాడు అనే విషయాన్ని పెళ్లి కూతురుకు బంధువులు చెప్పలేదు. కళ్యాణ మండపం నుంచి వధూవరులను పంపించిన తర్వాత సాయంత్రం పూట నరసయ్య అంత్యక్రియలను నిర్వహించారు.