బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి నటన తో అందరిని ఫిదా చేసేసింది. పైగా తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ అందాల తార ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రాజెక్ట్-కే అనే సినిమాలో ప్రభాస్ సరసన ఈమె హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా పఠాన్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది దీపిక.

Video Advertisement

అలానే ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కే రాబోతోంది.

మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు లోనే కాకా హిందీ లో కూడా రిలీజ్ కాబోతోంది. సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంగా ఈ సినిమా ని రూపొందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని కూడా ప్రాజెక్ట్-కే లో నటించనున్నారు. ప్రాజెక్ట్ కే విలువ 500 కోట్లని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2021 జులై లో మొదలైన విషయం తెలిసిందే. దీపికా ఈ సినిమా తో తెలుగు సినిమాల లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో నటించడానికి దీపికా ఎంత తీసుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే ప్రాజెక్ట్ కే కోసం తక్కువ తీసుకోదు.. ఎక్కువే తీసుకుంటుందని చాలా మంది భావిస్తున్నారు అయితే మరి ఆమె ప్రాజెక్టు కే కోసం ఎంత తీసుకుంటుంది అనే విషయానికి వస్తే… ఈమె ఏకంగా 10 కోట్ల రూపాయలని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా ఇదే రేంజ్ లో డిమాండ్ చేస్తోంది. అలానే ఈ సినిమా కోసం కూడా భారీగానే తీసుకుంటోంది దీపిక. దీపిక నటించిన పఠాన్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. షారుఖ్ ఖాన్ చాలా రోజుల నుండి హిట్ కోసం చూస్తున్నారు. కానీ షారుక్ ఖాన్ కి పఠాన్ తో అదృష్టం కలిసి వచ్చినట్టుంది. సినిమా హిట్ అయింది.