బ్రేకప్ కి కారణం ఇదే అంటూ… అసలు విషయాన్ని బయట పెట్టిన దీప్తీ..!!

బ్రేకప్ కి కారణం ఇదే అంటూ… అసలు విషయాన్ని బయట పెట్టిన దీప్తీ..!!

by Megha Varna

Ads

తాజాగా దీప్తి సునైనా, షన్ను వాళ్ళ ఐదేళ్ల ప్రేమకి గుడ్ బై చెప్పేసారు. ఈ విషయాన్ని దీప్తి ఇంస్టాగ్రామ్ లో “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలానే షణ్ముఖ్ మరియు నేను ఆలోచించి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవాలని అనుకుంటున్నాం అని అంది.

Video Advertisement

ఇది ఇలా ఉంటే షన్ను కూడా తనకి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది అని అన్నాడు. అలానే ఇప్పటి వరకు ఆమె చాలా చేసిందని, ఇప్పుడు ఆమె ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని షన్ను చెప్పిన విషయమూ తెలిసినదే. అయితే ఎంతో కాలంగా వెలిగిపోతున్న ఈ యూట్యూబర్స్ దాదాపు కెరీర్‌ను ఒకేసారి ప్రారంభించారు.

వీళ్ళు డబ్ స్మాష్‌లతో, షార్ట్ ఫిల్మ్స్‌తో, కవర్ సాంగ్స్‌తో స్టార్స్ గా మారిపోయారు. అయితే ఈ జంట బిగ్ బాస్ 5 కారణంగా విడిపోయారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే బ్రేకప్ పోస్ట్ తరవాత తాజాగా దీప్తి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో తన ఫ్యాన్స్‌తో మాట్లాడింది.

ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లైవ్ లో బ్రేకప్ కి కారణాన్ని రివీల్ చేసింది దీప్తి. ఇన్నేళ్లు తన కెరీర్ గురించి పెద్దగా ఆలోచించలేదని.. ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ చెయ్యాలని అనుకుంటున్నానని అంది దీప్తి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు లైవ్‌లో క్లియర్ గా చెప్పింది దీప్తి.

 

 


End of Article

You may also like