Ads
బాహుబలి చిత్రం సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీతో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటిలో ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సంపాదించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
Video Advertisement
ఇప్పటికి కూడా ప్రేక్షకుల కన్నులకు కట్టినట్లుగా ప్రతి సన్నివేశం గుర్తుండి పోయేలా ఉంది ఈ చిత్రం. బాహుబలి చిత్రంతో దర్శకుడు రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈ ఇంత అద్భుతమైన చిత్రానికి కొన్ని సీన్లు మర్చి ఉంటే మరో రేంజ్ లో ఉండేది అంటూ ఇప్పటికీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
బాహుబలి ది బిగినింగ్ లో దర్శకులు రాజమౌళి హీరో పంచభూతాలను దాటుకుంటూ వచ్చే విధంగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారట. మొదట అవంతిక ముఖానికి వేసుకునే మాస్క్ బదులుగా ఆమె నగల మూటని కోతి తీసుకుపోయే విధంగా సన్నివేశాన్ని సిద్ధంచేసుకున్నారట రాజమౌళి. కోతి విషయంలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోతికి బదులుగా జలపాతం నుంచి మాస్కు కింద పడే విధంగా స్క్రిప్ట్ ని మర్చి రాసుకున్నాడట రాజమౌళి. అదేవిధంగా అవంతిక కోసం మంచు కొండలలో సైనికులతో ఫైట్ చేస్తున్న సీన్ లో సైనికుడు శివుడిని బాహుబలి అనుకొని పొరబడి ప్రభు నన్ను ఏమీ చేయవద్దు అంటు అక్కడ నుంచి పారిపోయి అసలు విషయాన్ని బిజ్జిలదేవునికి చెప్పే విధంగా సన్నివేశాన్ని రాసుకున్నారట రాజమౌళి.
ఇది కాస్త బిజ్జిలదేవుడు ఆ మాట నమ్మకుండా బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను మట్టిలో కలిపేసాము అనే విధంగా స్క్రిప్ట్ సిద్ధమైందట. ఇక బాహుబలి చిత్రం విగ్రహాన్ని పైకి లేపిన తరువాత ఇంటర్వెల్ వేస్తారు చిత్రంలో. కానీ ఇంటర్వెల్ అనేది దేవసేన మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు బాహుబలి తిరిగి వచ్చాడు అనే డైలాగ్ దగ్గర పెట్టాలని మొదట అనుకున్నారట. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఈ చిత్రంపై ఇంకా చర్చ జరగడం గమనార్హం గా ఉంది. ఈ చర్చ బాహుబలి 3 రాబోతుందా అనే విధంగా ఆసక్తి రేపుతుంది.
End of Article