ఆచార్య సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?

ఆచార్య సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు. ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది?

Video Advertisement

ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.

midhun 1

అయితే.. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం చాలా మందిని ఆకట్టుకున్నాయి. వాటిలో ఒకటి చైల్డ్ ఆర్టిస్ట్ మిథున్ నటించిన పాత్ర. మిథున్ మందమర్రికి చెందిన డా. భీమనాధుని సదానందం మనవడు. శ్రీధర్, సరిత మిథున్ తల్లి తండ్రులు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లోనే రామంత పూర్ లో నివాసం ఉంటున్నారు. ఆచార్య సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న టైములో శ్రీధర్ సన్నిహితులు విజయ్ కుమార్ ద్వారా ఈ సినిమా యూనిట్ తో పరిచయం ఏర్పడింది.

midhun 2

మిథున్ శ్రేయాస్ ఆడిషన్స్ కి వచ్చి డైలాగ్స్ ని బాగా చెప్పడంతో అతన్ని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం సెయింట్ జోసెఫ్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న మిథున్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. చిరంజీవి సినిమాలో తన మనవడు కూడా నటించడం తనకి సంతోషాన్ని కలిగించిందని డా సదానందం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like