Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిపోయింది. దీనితో ఫాన్స్ ఆనందంతో సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు వేశారు.ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మార్నింగ్ షో నుండి ఈ సినిమా అలరిస్తోంది.
Video Advertisement
అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటి కోసమే ఇప్పుడు చూద్దాం. ప్రతిభ ఉన్న వ్యక్తి ఎలా అయినా పైకి రాగలడు అని అంటారు. అలా చాలా మంది సంగీత రంగంలో కూడా తమ గాత్రం ద్వారా పేరు తెచ్చుకుంటున్నారు.
భీమ్లా నాయక్ సినిమా ద్వారా కూడా ఇద్దరు ఫోక్ సింగర్స్ పరిచయం అయ్యారు. వారిలో ఒకరు మొగిలయ్య కాగా, మరొకరు కమ్మరి దుర్గవ్వ. మొగిలయ్య ఇప్పటికే చాలా మందికి పరిచయం అయ్యారు. అడవితల్లి పాటతో.. ఆ పాట పడిన దుర్గవ్వ గురించి అందరికి ఆసక్తి రేకెత్తుతోంది.
దుర్గవ్వ గతంలో కూడా సినిమా పాటలు పాడారు. పలు మరాఠీ చిత్రాలలో ఆమె పాటలు పాడారు. కమ్మరి దుర్గవ్వ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన వారు. ఆమె భర్త రాజయ్య మరణించడంతో.. పొలం పనులు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. అయితే.. వరినాట్లు వేయడం, నీరు పట్టడం వంటి పొలం పనులు చేసుకుంటూనే ఆమె పాటలు పాడేవారు. స్థానికంగా ఆమె పాటలకి మంచి గుర్తింపు లభించింది. ఆమె జానపద పాటలు అద్భుతంగా పాడేది.
ఆమె టాలెంట్ నలుగురికి తెలియాలన్న ఉద్దేశ్యంతో ఆమె కూతురు శైలజ ఆమె పాడిన పాటలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేది. అలా దుర్గవ్వ గురించి బయటి ప్రపంచానికి కూడా తెలిసింది. “సిరిసిల్ల చిన్నది.. నాయితల్లే..” అనే పాటతో పాటు “ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే” అనే పాట కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మామిడి మౌనిక, సింగర్ మల్లిక్‌తేజ సాయంతో “భీమ్లా నాయక్” సినిమాలో కూడా పాట పాడే అవకాశం లభించింది.
End of Article