Ads
హీరో కృష్ణ… తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక శకం ముగిసిపోయింది.అయన తోటి హీరోలు అయిన సీనియర్లు అందరు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయారు. అంతకు ముందు మహేష్ తల్లి ఇందిరాదేవి గారు మరణించటం, ఈ ఏడాది ప్రారంభం లో రమేష్ బాబు మరణించటం తో ఘట్టమనేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Video Advertisement
కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం కాగా కృష్ణను చివరిసారి చూసిన ఫ్యాన్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమయింది.కడసారి వీడ్కోలుకు భారీ సంఖ్యలో కృష్ణ ఫ్యాన్స్ హాజరయ్యారు.
కృష్ణ మరణంతో ఆయన ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ తన ఆస్తులు మనవళ్లు, మనవరాళ్లకు చెందేలా వీలునామా రాశారని సమాచారం.కృష్ణ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు కాగా దానధర్మాలు చేయడం వల్ల ఆయన ఆస్తుల విలువ తగ్గిందని సమాచారం.
అంతేకాకుండా కృష్ణ గారిని చాలా మంది నిర్మాతలు మోసం చేసిన సందర్భాలు కూడా ఎక్కువే అని వినికిడి. ఆయన నటించిన సినిమా ప్లాప్ అయితే తన పారితోషికంతో డిస్ట్రిబ్యూటర్లు అలాగే నిర్మాతల నష్టాలు తీర్చేవారట.ఆ నిర్మాతకు ఇంకో సినిమాని ఫ్రీగా చేసిపెట్టడం లేదా సగం పారితోషికానికి చేసి పెట్టడం వంటివి చేసేవారు. ఆయన స్టూడియోని కూడా అందుకే మెయింటైన్ చేయలేకపోయారు అని తెలుస్తోంది. ఇప్పటి లెక్కల ప్రకారం రూ.400 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. అది మొత్తం తన మనవళ్ళు, మనవరాళ్ళకే.. చెందాలి అని ఆయన వీలునామాలో రాశారట.
ముఖ్యంగా కొడుకుల బిడ్డలు అంటే రమేష్ బాబు, మహేష్ బాబు ఎక్కువ వాటా చెల్లుతుందట. కూతుర్ల బిడ్డలకు కూడా ఇంత పర్సెంటేజ్ అనే వాటా ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు విజయ నిర్మల గారి కి సంబంధించిన ఆస్తిలో నరేష్ కు మరియు అతని సంతానానికి వాటా చెల్లుతుంది. అది కూడా వందల కోట్ల పైనే ఉంటుందని వినికిడి. ఈ ప్రకారంగా చూసుకుంటే కృష్ణ గారి ఆస్తిలో నరేష్ కి ఎటువంటి భాగం లేదు అని తెలుస్తోంది. కానీ విజయనిర్మల కి సంబంధించిన ఆస్తి మాత్రం నరేష్ కి చెందుతుంది అని అన్నారు.
End of Article