Ads
హీరో కృష్ణ… తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక శకం ముగిసిపోయింది.అయన తోటి హీరోలు అయిన సీనియర్లు అందరు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయారు. అంతకు ముందు మహేష్ తల్లి ఇందిరాదేవి గారు మరణించటం, ఈ ఏడాది ప్రారంభం లో రమేష్ బాబు మరణించటం తో ఘట్టమనేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Video Advertisement
ఆప్తులైన వారు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉండటం మహేష్ బాబును ఎంతగానో బాధ పెడుతోంది.తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం మహేష్ బాబు పైనే ఉంది.
అయితే ఈ మరణాల వల్ల మహేష్ బాబు మాత్రమే కాకుండా మరొక వ్యక్తికీ కూడా తీరని శోకం మిగిలింది. ఆవిడ ఎవరంటే ఘట్టమనేని రమేష్ బాబు గారి భార్య మృదుల. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు అయిన మృదుల ఏనాడు మీడియా ముందు కనిపించలేదు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ, వీరు ఎక్కువగా మీడియా ముందుకు రారు. ఘట్టమనేని ప్యామిలీ ఫంక్షన్స్ లో కూడా వీరు కనిపించింది తక్కువే.
కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రమేష్ బాబు హీరోగా నిలబడలేక పోయారు. తరువాత ప్రొడ్యూసర్ గా మారి మహేష్ బాబుతో కొన్ని సినిమాలు నిర్మించారు. కానీ అవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత నుంచి రమేష్ బాబు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. రమేష్ బాబు పిలల్లకు ఇంకా వివాహాలు కూడా జరగలేదు. ఇప్పుడు ఈ వరుస మరణాలతో మృదుల ప్రపంచం మూగబోయింది.
End of Article