దేవర సినిమాలో ఎన్టీఆర్ కాకుండా మరో హీరో ఉన్నారా..? ఇది మల్టీ స్టారర్ మూవీ నా…?

దేవర సినిమాలో ఎన్టీఆర్ కాకుండా మరో హీరో ఉన్నారా..? ఇది మల్టీ స్టారర్ మూవీ నా…?

by Mounika Singaluri

2024లో రానున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి దేవర. ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Video Advertisement

తాజాగా దేవర ఫస్ట్ లుక్ విడుదల చేసి టీజర్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక వైరల్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ఇది మల్టీస్టారర్ మూవీ అంటూ చెబుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ తో పాటు నటించే ఆ స్టార్ హీరో ఎవరో కాదు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. దేవర పార్ట్ 2 లో దేవర సోదరుడు సూరిగాడు పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడట. దేవర పార్ట్ వన్ లో వచ్చే ట్విస్ట్ సూరి తోటి ఎండ్ అవుతుంది అని అంటున్నారు. పార్ట్ టూ మొత్తం సూరీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.

ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాబట్టి విజయ్ దేవరకొండ కూడా ఇందులో నటించేందుకు ఓకే చేశాడని అంటున్నారు. మరియు వార్తల్లో ఎంతవరకు నిజం అనేది మేకర్స్ చెప్పే అంతవరకు తెలియదు. దేవర సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు


You may also like

Leave a Comment