అప్పటి దాకా దేవర గ్లింప్స్ విడుదల అవ్వదా….నిర్మాత ప్రకటన…..!

అప్పటి దాకా దేవర గ్లింప్స్ విడుదల అవ్వదా….నిర్మాత ప్రకటన…..!

by Mounika Singaluri

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆసక్తిగా ఆర్ఆర్అర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

Video Advertisement

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి జహ్నవి కపూర్ నటిస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అయితే తొందరలో ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపైన నిర్మాతలు ఒక స్పష్టత ఇచ్చారు.

దేవర మూవీనీ నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి అయినట్లు ననందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించారు. అయితే దేవర గ్లింప్స్ కోసం ఆయనను అడగగా ఒక క్లారిటీ ఇచ్చారు… దేవర మూవీనీ చాలా ప్రతిష్టాత్మకంగా తరికెక్కిస్తున్నామని క్వాలిటీ విషయంలో రాజి పడేది లేదని తెలిపారు. క్వాలిటీ విషయంలో ఒక స్పష్టత వచ్చాకా కాని విడుదల చేయమని తెలియజేశారు. అభిమానుల అంచనాలను అందుకునే విధంగా మూవీని తరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాక కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ ఈ నెల 29 న విడుదల కానుంది. దీనీ ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ పాల్గొంటున్నారు


You may also like

Leave a Comment