Ads
వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా గుర్తుందా..? ఆ రోజుల్లో ఫాంటసీ మూవీల్లో ఇది కూడా ఒకటి. వెంకటేష్, సౌందర్య జంట గా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే బిగ్ హిట్ అయింది. చాలా భిన్నమైన కథతో దర్శకుడు కోడి రామ కృష్ణ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి కధలను తెరకెక్కించడం లో కోడి రామకృష్ణ గారు దిట్ట. ఈ సినిమా లో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఐదు వేల సంవత్సరాల క్రితం సునామి కారణంగా ద్వారకా నగరం మునిగిపోతుంది. దీనికి, వెంకటేష్ కి ఉన్న సంబంధమేంటి..? కృష్ణ గా నటించిన వెంకటేష్ ద్వారకకు ఎందుకు వస్తాడు..? గత జన్మ గురించి ఎలా తెలుసుకుంటాడు..? బేబీ చెర్రీ ఎవరు…? తనకు మాత్రమే కనిపించి ఎందుకు ఆటలాడుతుంది..? వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ సినిమా. ఈ సినిమా స్టోరీ అందరికి తెలిసిందే..
కాకపోతే, ఈ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ చెర్రీ అసలు పేరు వేగా తమోతియా. ఆమె ఇప్పుడు పెద్దయ్యి హీరోయిన్ లా ఉన్నారు. ప్రస్తుతం ఆమె సౌత్ సినిమాలలో కనిపించకపోయినా ఆమె పలు బాలీవుడ్ సినిమాలలో నటించారు. ఆమె “ఆమ్రాస్” (amras ) మూవీ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో కంటే ముందు ఆమె తమిళ, తెలుగు సినిమాలలో నటించారు. 2008 లో “సరోజ” అనే మూవీ తో తమిళ్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు.
#1
#2
#3
#4
#5
End of Article