Ads
జబర్దస్త్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనరాజ్ సినిమాలలో నటిస్తూనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ మధ్య విమానం అనే సినిమాలో నటిచించి తన నటనకి మంచి మార్కులు వచ్చాయి.
Video Advertisement
ఈ తరుణంలో ధనరాజ్ డైరెక్టర్ గా అడుగుపెట్టపోతున్నారు.తమిళ నటుడు సముద్రఖని మెయిన్ లీడ్ గా తీసుకొని తండ్రి-కొడుకుల సెంటిమెంట్ తో వస్తోంది అని సమాచారం.ఈ సినిమా మీద రంగంలో మంచి అంచనాలు ఉన్నాయ్.
ఎందుకంటే ఇది కూడా మరో బలగం అవుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.ఇక అందులో భాగంగానే ధనరాజ్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నాడు.
ఇక ప్రస్తుతం నటులు అందరూ కూడా డైరెక్టర్లుగా మారుతూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.ఇక అదే బాట లో ధనరాజ్ కూడా డైరెక్టర్ గా చేస్తూనే ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
నవంబర్ 9 న ఈ సినిమా హైదరాబాద్ లో మొదటి విడుత షూటింగ్ మోడలింది అని సమాచారం.ఈ సినిమా ని పృథ్వి స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ కింద ప్రొడ్యూస్ అవుతోంది.హరీష్ ఉత్తమన్,మోక్ష,శివ పైనెలా,అరుణ్ చిలువేరు ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అయితే హాస్య నటులు డైరెక్టర్లుగా మారడం మాత్రం అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలా మారిన వారు సక్సెస్ అయిన సందర్భాలూ చాలా తక్కువే. మోస్ట్ సీనియర్ కమెడీయన్లు ఏవీఎస్ తీసిన ‘సూపర్ హీరోస్’, ఎంఎస్ నారాయణ డైరెక్ట్ చేసిన ‘కొడుకు’, ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో వచ్చిన ‘రెండు తోకల పిట్ట’ ఇలా ఎందరో స్టార్ కమెడియన్లు డైరెక్షన్లోకి దిగి నిరాశ చెందారు. ఈ క్రమంలో వీటన్నింటికీ సమాధానంగా ఈ ఏడాది వచ్చిన ‘బలగం’ సినిమాతో డైరెక్టర్గా తన మొదటి ప్రయత్నంలోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు జబర్దస్ స్టార్ కమెడియన్ వేణు యెల్దండి. పైగా ఈ చిత్రానికి బడా నిర్మాత దిల్రాజు నిర్మాతగా వ్యవహరించారు.
End of Article