CAPTAIN MILLER: ధనుష్ “కెప్టెన్ మిల్లర్” సినిమా ఎలా ఉంది.? స్టోరీ ఏంటి? హిట్టా.?

CAPTAIN MILLER: ధనుష్ “కెప్టెన్ మిల్లర్” సినిమా ఎలా ఉంది.? స్టోరీ ఏంటి? హిట్టా.?

by Harika

Ads

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలైనా రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. అయితే తాజాగా ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్ లో విడుదలైంది. సంక్రాంతి సినిమాలో పోటీ కారణంగా తెలుగులో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది… ధనుష్ కి మరో హిట్టు దక్కిందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం…!

Video Advertisement

ధనూష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ బ్రిటీష్ నేతృత్వంలోని భారత సైన్యంపై దురాగతాన్ని చూసి పోరాడే వ్యక్తి కథతో రూపొందినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభం నుంచీ నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించి సంక్రాంతి కానుకగా తీసుకు వచ్చారు. డిఫరెంట్ గా కట్ చేసిన ట్రైలర్ కూడా ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఇది స్వాతంత్య్ర పోరాటంతో పాటు అసురన్, కర్ణన్‌ను పోలి ఉంటుంది. మొదటి సగం మాత్రం గందరగోళంగా ఉంది.

ధనుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. అరుణ్ మతేశ్వరన్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్ మరోసారి తన పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు. వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ తో ధనుష్ బాగా అలరించారు.

శివరాజ్ కుమార్ సందీప్ కిషన్ పాత్రలు కూడా కథలో కీలకంగా వస్తాయి. ప్రియాంక మోహన్ తన పరిధి మేరకు బాగా నటించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ధనుష్ పెర్ఫార్మన్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే అన్ని సెక్టార్ల ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్. ఫైనల్ గా… ధనుష్ నటించిన అసురన్, కర్ణన్ సినిమాలు నచ్చితే ఈ సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది


End of Article

You may also like