ప్రశాంత్ నీల్ పక్కన ఉన్న ఈ వ్యక్తి గొంతు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..! ఎవరంటే..?

ప్రశాంత్ నీల్ పక్కన ఉన్న ఈ వ్యక్తి గొంతు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..! ఎవరంటే..?

by Mounika Singaluri

తెలుగులో చాలా మంది డబ్బింగ్ నటులు ఉన్నారు. వారు పరభాష నటులకు తెలుగులో డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలాగే తెలుగులో డబ్బింగ్ అయ్యే తమిళ్, కన్నడ చిత్రాలు కూడా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే చెబుతూ ఉంటారు.

Video Advertisement

ఎక్కువమంది తమిళ్ హీరోలకు తెలుగులో ఒక అతని గొంతు బాగా వినిపిస్తూ ఉంటుంది. అతని పేరు వాసు. ఈ మనిషి ఎవరికీ పరిచయం ఉండకపోవచ్చు గాని ఇతని మాట మాత్రం అందరికీ పరిచయమే.

dhanush telugu dubbing artist

వాసు చిన్నప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇండస్ట్రీలో వాసు బంధువులు ఉండడంతో వాసు అలా డబ్బింగ్ రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత మెల్లగా హీరో పాత్రలకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. శివ పుత్రుడు సినిమాలో సూర్య పాత్రకి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత భరత్ హీరోగా నటించిన ప్రేమిస్తే సినిమాలో భరత్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా వాసుకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

dhanush telugu dubbing artist

వాసు తన గొంతుతో ఎలాంటి వేరియేషన్స్ అయినా పలికించగలుగుతారు. అందుకే ఏ తెలుగు డబ్బింగ్ సినిమాలో అయినా సరే యంగ్ హీరోలు అందరికీ వాసు డబ్బింగ్ చెప్తారు. ధనుష్ సినిమాలు అన్నిటికీ తెలుగులో వాసునే డబ్బింగ్ చెప్పారు. అలాగే దాదాపు అన్ని విజయ్ సినిమాలకి కూడా వాసు డబ్బింగ్ చెప్తారు. విజయ్ కి వాసు గొంతు చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. లారెన్స్ కి కూడా ఎన్నో సినిమాల్లో చెప్తారు. వాసు సినిమాలకి మాత్రమే కాదు సీరియల్స్ కి కూడా డబ్బింగ్ చెప్పారు.

dhanush telugu dubbing artist

అంతేకాకుండా కొన్ని తమిళ్ సినిమాల్లో కొన్ని పాత్రలకి కూడా వాసు డబ్బింగ్ చెప్పారు. వలిమై సినిమాలో కార్తికేయ పాత్రకి తమిళ్ లో వాసునే డబ్బింగ్ చెప్పారు. ధనుష్, విజయ్, శివ కార్తికేయన్, లారెన్స్, కేజీఎఫ్ హీరో యష్, తాజాగా విడుదల యానిమల్ లో రణబీర్ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది ఇతనే.ఇతను వాయిస్ ఏ హీరోకి అయిన బాగా సూట్ అవుతుంది. తన విజయ్ దేవరకొండ కి తమిళ్ లో కూడా తన వాయిస్ ని అందించారు.ఈ హీరోలు ఒరిజినల్ వాయిస్ కంటే కూడా వాసు వాయిస్ బాగా గుర్తింపు తీసుకొచ్చింది.

dhanush telugu dubbing artist

ఎంతమంది హీరోలకు డబ్బింగ్ చెప్పిన కూడా ఎవరికి తగ్గ వేరియేషన్ వారికి చూపించడం వాసులోని స్పెషాలిటీ. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో అగ్రేసివ్ నెస్ వాసు వయసులో బాగా పలికింది. వాసు భార్య కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడం విశేషం. వాసు భార్య ప్రియాంక ఎంతో మంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పారు. ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ సంధ్య పాత్రకి ప్రియాంక డబ్బింగ్ చెప్పారు. ప్రేమిస్తే సినిమా సమయంలోనే వాసు, ప్రియాంక ప్రేమించుకున్నారు. అంతే కాకుండా ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి దాదాపు ప్రియాంక గొంతే వినిపిస్తుంది.

Images source: Facebook (Vasu Sayz)

ALSO READ :లక్షన్స్ టైంలో కూడా ఇన్ని గొడవలు అవ్వలేదు ఏమో..! బిగ్ బాస్ ఫినాలే తర్వాత ఇంత గొడవ ఎలా జరిగింది..?


You may also like

Leave a Comment