Ads
ఢీ ప్రోగ్రాం ద్వారా కొరియోగ్రాఫర్ గా యశ్ కి మంచి పేరు వచ్చింది. ఆయన డాన్స్ ను కంపోజ్ చేసే శైలి కూడా భిన్నం గా ఉండడం తో.. తక్కువ కాలం లోనే ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన టీం లోనే డాన్స్ చేసిన కేవల్ అనే ఢీ కంటెస్టెంట్ గత కొంతకాలం గా బ్లడ్ కాన్సర్ తో బాధ పడుతున్నారు. ఈ విషయాన్నీ యశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
Video Advertisement
ఆయనను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఎంతోకొంత ఆర్ధిక సాయం చేయాలంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయన అభ్యర్ధించారు. అలాగే కేవల్ బ్లడ్ గ్రూప్ ని కూడా చెప్పి.. బ్లడ్ కూడా అవసరం అవుతోందని.. కేవల్ బ్లడ్ కి సరిపడా బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సాయం చేయాలని కోరారు. మరో వైపు ఢీ షో జడ్జిలు పూర్ణ, ప్రియమణి కూడా కేవల్ కు సాయం చేసి.. ఇంకా పలువురు ముందుకు రావాలని కోరారు.
సీరియల్ నటి మేఘన సైతం తనవంతు సాయం చేసింది. కేవల్ ను బతికించుకోవాలని అందరు ఎంతగానో ఆరాటపడ్డారు. డాక్టర్లు కూడా తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ.. మన ప్రార్ధనలు ఫలించలేదు. కేవల్ ఇక లేరు. ఈ విషయాన్ని యశ్ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తీవ్ర అనారోగ్యం తో ఆదివారం మధ్యాహ్నం కేవల్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. “నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నా.. ఈ బాధ జీవితాంతం వెంటాడుతుంది..” అంటూ ఆవేదన చెందారు. నెటిజన్లు సైతం కేవల్ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.
https://www.instagram.com/p/CT_7v-bhceQ/?utm_source=ig_embed&ig_rid=e36fb170-e4a1-474f-86b3-7b1c696c3d7f
End of Article