Ads
యాంకర్ గా ప్రదీప్, టీమ్ లీడర్స్ గా రష్మి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, దీపిక పిల్లి జడ్జెస్ గా ప్రియమణి గారు, పూర్ణ గారు మరియు గణేష్ మాస్టర్ లు వ్యవహరిస్తున్న ఢీ షో గురించి అందరికి తెలిసిందే. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో “ఢీ”. 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు “ఢీ” ఛాంపియన్స్(“ఢీ” 13వ సీజన్) తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
Video Advertisement
ఇందులో ఎన్నో రకాల కాన్సెప్ట్స్ తో డాన్స్ పెరఫార్మెన్సెస్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. వాళ్ళ డాన్స్ పెరఫార్మెన్స్ టీవీ తో పాటు, యూట్యూబ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో అందరూ గ్రామీణ నేపథ్యం ఉన్న పాటలపై డాన్స్ వేస్తున్నారు.
ఇందులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అవునన్నా కాదన్నా సినిమాలోని ఒక పాట పై ఒక కంటెస్టెంట్ పర్ఫామెన్స్ చేస్తున్నారు. దాంతో కామెంట్స్ అన్ని ఉదయ్ కిరణ్ గురించే ఉన్నాయి. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తనని మనం మర్చిపోలేదు అనడానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
End of Article