ఆ రైల్వే స్టేషన్ బయట టీ స్టాల్ నడిపే వ్యక్తి ధోనికి ఎందుకంత స్పెషల్..? అసలా స్టోరీ ఏంటి..?

ఆ రైల్వే స్టేషన్ బయట టీ స్టాల్ నడిపే వ్యక్తి ధోనికి ఎందుకంత స్పెషల్..? అసలా స్టోరీ ఏంటి..?

by Anudeep

ధోని.. క్రికెట్ అభిమానులందరికీ ఆయన అంటేనే కాదు.. ఆయన వ్యక్తిత్వం అంటే కూడా ప్రత్యేకమైన అభిమానం. కారణం ఏంటి అంటే.. డౌన్ టు ఎర్త్ ఉండే ఆయన స్వభావమే. అంత ఒత్తిడి లోను కూల్ గా ఆట ను ముగించడం లో ధోని ని మించిన వారు ఎవరు లేరు. అందుకే.. కెప్టెన్ లు ఎందరు ఉన్నా..కెప్టెన్ కూల్ అనగానే ముందు గుర్తొచ్చేది ధోని నే. ధోని డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పడానికి ఈ ఉదాహరణ ను చూడండి..

Video Advertisement

dhoni 1

ధోని సినిమా చూసిన తరువాత.. ధోని కి అభిమానులు మరింత గా పెరిగారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్ కి రాకముందు ధోని “ఖరగ్ పూర్” రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పని చేసేవారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ సమయం లో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న టీ స్టాల్ లో టీ అమ్మే వ్యక్తి తో ధోని కి సాన్నిహిత్యం ఉండేది.

dhoni 3

ధోని పెద్ద ప్లేయర్ అయిన తరువాత కూడా ఆ పరిచయాన్ని మరిచిపోలేదు. మాములుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయం లో ధోని ని కలవడం చాలా కష్టం. అలా కాకుండా దేశవాళీ మ్యాచ్ లు ఆడే సమయం లో ధోని కొంత ఫ్రీ గా ఉంటారు. ఆ సమయం లోనే ధోని తిరిగి వెళ్ళేదారిలో ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో తన స్నేహితుల్ని కలిశారు. వారితో పాటే రైల్లో ప్రయాణం చేసారు. తిరిగి వెళ్తు ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ బయట టీ స్టాల్ లో టీ కూడా తాగారట.

dhoni 2

స్టేషన్ బయట టీ స్టాల్ “థామస్” అనే వ్యక్తి ది. ధోని ని చూసి థామస్ ఎంతో సంతోషించాడు. గతం లో ధోని కోసం థామస్ ప్రత్యేకం గా పాలను అట్టిపెట్టేవాడట. అలా వారందరిని తిరిగి కలిసిన ధోని వారితో పాటు భోజనం కూడా చేసి తిరుగు ప్రయాణమయ్యాడట.


You may also like