జబర్దస్త్ కామెడీ ద్వారా ఎంతో పేరు సంపాదించిన గెటప్ శీను తెలుగు ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఆలోచనతో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఒక స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అవి మాటల్లో చెప్పలేం.

Video Advertisement

స్టార్ హీరోతో చేసిన తర్వాత గుర్తింపు లభిస్తుంది ఎన్నో అవకాశాలు వస్తాయని భావిస్తూ ఉంటారు కొత్తగా ఎంట్రీ అవుతున్న నటీనటులు. అలాగే అనుకున్నారు గెటప్ శీను కూడా.

ఈయన ఆచార్య మూవీలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారట. ఈయన మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఎంతో సమయాన్ని కేటాయించి చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. కానీ గెటప్ సీన్ కు ఆచార్య మూవీ నుంచి గట్టి దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. సినిమా కోసం ఎన్ని రోజులు కష్టపడినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో గెటప్ శీను చాలా బాధ పడుతున్నారని సమాచారం. అయితే ఈ మూవీలో గెటప్ శ్రీను కాజల్ తో పాటు చేసినటువంటి కామెడీ సన్నివేశాలు అన్నింటిని తొలగించారని తెలుస్తోంది.

దీంతో గెటప్ శీను పాత్ర సినిమాలో లేకపోవడంతో ఎంతో నిరాశ చెందాడు. ఈయన ఆచార్య మూవీలో ఎక్కువగా కాజల్ తో ఈ సన్నివేశాలు ఉండటంతో కాజల్ పాత్ర ను తొలగించడం వల్ల గెటప్ శీను సన్నివేశాలు కూడా తొలగించడం జరిగింది. అయితే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న. గెటప్ శ్రీను ఎంతో పేరు వస్తుందని అనుకున్నారు. కానీ ఆయన ఆశలపై ఆచార్య సినిమా గట్టి దెబ్బ వేసింది అని చెప్పవచ్చు.