Ads
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రియ ఎలిమినేట్ అవుతుండడం షాక్ ని కలిగించే విషయమే. అయితే..సన్నీ తో గొడవ పెట్టుకోవడం, కొన్ని సార్లు దురుసుగా మాట్లాడడం వల్లే ఆమె ఎలిమినేట్ అయిపోయారు అంటూ కధనాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక.. ప్రియ తన అభిమానులను ఉద్దేశించి ఓ మెసేజ్ ను కూడా షేర్ చేసారు.
Video Advertisement
తాజాగా.. మరో కధనం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రియ బిగ్ బాస్ యాజమాన్యం పై కేసు పెట్టిందంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో అనేక అసమంజసమైన కార్యాకలాపాలు కొనసాగుతున్నాయని.. బయట కొందరు ఇస్తున్న సపోర్ట్ తో.. ఇంట్లో కొందరు కంటెస్టెంట్ లు ఎంజాయ్ చేస్తున్నారని.. బయటివారి సపోర్ట్ తో ఎలిమినేట్ అవ్వకుండా కొనసాగుతున్నారని.. నిజంగా గేమ్ ఆడేవారు మాత్రం ఎలిమినేట్ అవ్వాల్సి వస్తోందని ప్రియ ఫిర్యాదు చేసిందని ఈ కధనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ విషయమై ఎక్కడ అధికారిక ప్రకటన రాలేదు. నిజంగానే ప్రియ ఫిర్యాదు చేశారా? లేదా అన్న విషయం తెలియరాలేదు.
End of Article