Ads
‘బిగ్ బాస్ 6’ కి 7 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ కళ్యాణ్. మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ను డ్రా చేశాడు. ఇప్పటికే పలు చిన్న సినిమాల్లో హీరోగా నటించాడు అర్జున్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగళ్ళ నటించిన ‘ప్లే బ్యాక్’ మూవీలో ఇతనే హీరో. విశాఖపట్నంలో బిటెక్ చదివిన అర్జున్, ఆ తర్వాత యుఎస్ లో మాస్టర్స్ ఫినిష్ చేశాడు. అక్కడే థియేటర్స్ కోర్స్ లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాడు.
Video Advertisement
స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్ లో కూడా అర్జున్ కి మంచి గ్రిప్ ఉంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. ప్రస్తుతానికి ‘బిగ్ బాస్’ లో అయితే కూల్ గోయింగ్ అన్నట్టు కొనసాగుతున్నాడు.సీజన్ 6 లో ఇతను ఎంత వరకు రాణిస్తాడో చూడాలి.
అయితే తాజాగా అర్జున్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అర్జున్ కళ్యాణ్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి తో ఒక సినిమాలో నటించాడట. అదేం సినిమా అంటే సాయి పల్లవి, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రం లో సాయి పల్లవి హీరో పై కోపం తో ముందు ‘హర్ష వర్ధన్ రాణే’ తో పెళ్ళికి ఒప్పుకుంటుంది. కానీ అతడ్ని పెళ్లి చేసుకోదు. ఇందులో సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పాత్రలో ముందుగా అర్జున్ కళ్యాణ్ ని తీసుకున్నారట. కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారట.
కానీ ఆ పాత్ర చిన్నదైనా కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బావుంటుందని హర్ష వర్ధన్ రాణే ని తీసుకున్నారట. తకిట తకిట సినిమాతో తెలుగు సినిమాలో అడుగు పెట్టిన హర్షవర్ధన్ రాణే ఆ తర్వాత అవును, గీతాంజలి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో అర్జున్ కళ్యాణ్ ఆ పాత్రని మిస్ అయ్యాడు.
End of Article