పప్పు తింటే నిజంగానే చీము పడుతుందా..??

పప్పు తింటే నిజంగానే చీము పడుతుందా..??

by Anudeep

సహజం గా మనకు కొన్ని సార్లు గాయాలు అవుతాయి. కొన్ని సార్లు అవి పుండ్లు గా మారుతుంటాయి. అయితే అటువంటి సమయం లో పప్పులు, వాటితో చేసిన పదార్థాలు తీసుకోవద్దని పెద్దవారు చెబుతారు. పప్పులు తింటే గాయానికి చీము పడుతుంది. అప్పుడు గాయం మానేందుకు చాలా టైం పడుతుంది అని చెప్తారు.

Video Advertisement

అలాగే ఆపరేషన్స్ జరిగినపుడు కూడా అలాగే అంటారు. మళ్ళీ కందిపప్పు తినొచ్చు, సెనగ పప్పు తినకూడదు అంటారు. అలాగే పెరుగు తిన్నా కూడా చీము పడుతుంది అని కొందరు నమ్ముతారు. మనం కూడా అదే ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు పప్పులు తింటే చీము పడుతుది అన్నది నిజమో కాదో.. ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ముందు గాయానికి చీము ఎలా పడుతుందో చూద్దాం.. మన శరీరానికి గాయం అయినపుడు రక్తం బయటకు వచ్చి.. తర్వాత గడ్డ కడుతుంది. తర్వాత బయటి నుంచి సూక్ష్మ జీవులు శరీరం లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు మన శరీరం లోని రోగ నిరోధక శక్తి అలెర్ట్ అయ్యి, వెంటనే గాయం అయిన చోటుకి తెల్ల రక్త కణాలను పంపిస్తుంది. అప్పుడు రోగ నిరోధక శక్తి కి, సూక్ష్మ జీవులకు మధ్య యుద్ధ జరిగి.. కొన్ని తెల్ల రక్త కణాలు మరణిస్తాయి. అప్పుడు తెల్ల రక్త కణాలు, అక్కడి కణజాలం, ప్లాస్మా, ఇంకా మిగిలిన సూక్ష్మ జీవులు చీము రూపం లో బయటికి వస్తాయి. అందుకే గాయాలు అయినపుడు ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి. లేదంటే ఇన్ఫెక్షన్ అవుతుంది.

did lenthils cause wound worst..

అసలు పప్పు తినడానికి, చీము పట్టడానికి సంబంధం లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. పైగా గాయం త్వరగా మానాలంటే ప్రోటీన్స్ ఉన్న ఆహరం తినాల్సి ఉంటుంది. అంటే పప్పు తప్పని సరిగా తినాలి. గాయం అయినపుడు జరిగినపుడు నశించిన తెల్ల రక్త కణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్ కావాలి. అలాగే ఉడికించిన పప్పు ఇంకా మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యం గా శాఖాహారులు గాయాలు మానేందుకు పప్పు ఖచ్చితం గా తినాలి.


You may also like