Ads
ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై అందరికి అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.
Video Advertisement
పూరి, ఛార్మి సంయుక్తంగా పూరి కనెక్ట్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. కరణ్ జోహార్ కూడా మరో నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్ర పరాజయంతో ఎవరెవరు ఎంత నష్ట పోయారు అన్న విషయం పై పలు కథనాలు వెలువడుతున్నాయి.
లైగర్ సినిమాతో పూరి జగన్, ఛార్మి ఏమి నష్టపోలేదని.. వాళ్లకి డబ్బులు బాగానే వచ్చాయని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు. సినిమా బడ్జెట్ సుమారు 50 నుండి 60 కోట్లు అవ్వగా.. బాలీవుడ్ కు చెందిన అనిల్ తడానీ 90 కోట్లకు కొన్నాడని ఫిలిం వర్గాల టాక్. ఈ సినిమాతో పూరీ, ఛార్మీ బాగానే వెనకేసుకున్నారనీ, వాళ్ళకి నష్టం ఏమి రాలేదని అంటున్నారు. అనిల్ తడానీ కూడా మంచి వ్యాపారం చేసుకొని తన సొమ్ము రాబట్టుకున్నాడని అంటున్నారు.
శాటిలైట్, ఓటిటి రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మడంతో.. వారికి బాగానే డబ్బులు వచ్చాయని సమాచారం. సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహార్‌కి కూడా డబ్బులు పోలేదని అంటున్నారు.ఫైనల్ గా చూస్తే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోయారు అని తెలుస్తోంది.
మరోవైపు హీరో విజయ్ దేవరకొండ కి కూడా నిర్మాతలు పూర్తి పారితోషికం ఇవ్వలేదని సమాచారం. విజయ్‌కి మొదటి నుండీ ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉండటంతో పాటు.. పూరి తో జనగణమన సినిమా కూడా ప్రకటించడంతో.. సినిమా విడుదలైన తర్వాత బ్యాలెన్స్ పారితోషికం తీసుకుంటానని చెప్పాడట. దీనికి పూరి జగన్, ఛార్మీ కౌర్ సరే అన్నారట. కానీ విడుదలైన తర్వాత.. ఇంకేముంది సినిమా పోయింది అన్నారు.. డబ్బులు పోయాయి అంటూ.. విజయ్‌కి ఇవ్వాల్సిన మిగతా పారితోషికం కూడా వారు ఇవ్వలేదని పరిశ్రమలో గుసగుసలు వినబడుతున్నాయి.
End of Article