సోషల్ మీడియా లో నటులు చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఒక పక్క సినిమాలు చేస్తూ మరొక పక్క సోషల్ మీడియాలో వారికి నచ్చిన ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటారు. ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నా లేదంటే ఏమైనా ఫ్యామిలీ గాథరింగ్స్ వంటివి అయినా సరే వాటి ఫోటోలని సోషల్ మీడియాలో నెటిజన్ల తో పంచుకుంటూ ఉంటారు.

Video Advertisement

బాగా నచ్చిన పిక్స్ ని ఫ్యాన్స్ కి తెగ షేర్ చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళకి నచ్చినట్లుగా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.

ఎక్కువగా మనకి హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి ఫోటోలు కనుక కనబడితే ఫ్యాన్స్ కి ఇంక పండగే. ఫ్యాన్స్ ఇలాంటి ఫొటోస్ ని తెగ షేర్ చేస్తూ ఉంటారు. విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ఒక చిన్నారి ఫోటో వైరల్ అవుతోంది. పాలుగారే బుగ్గలతో ఆ ఫోటో బాగా ఆకట్టుకుంటోంది. మరి ఇంతకీ ఆ ఫోటో లో ఉన్న చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఆ చిన్నారి ఇప్పుడు పెద్ద హీరోయిన్ ఇంకా అర్థం కాలేదా ఆమె ఎవరో కాదు మన బుట్ట బొమ్మ పూజ హెగ్డే.

did pooja hegde failed again in bollywood..

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పూజ హెగ్డే బాలీవుడ్ లో కూడా దూసుకు వెళ్ళి పోతోంది. సల్మాన్ ఖాన్ తో ఆమె ఇప్పుడు కిసి కా బాయ్ కిస్ కా జాన్ అనే సినిమాలో నటిస్తోంది. అలానే పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ లో ఇంకో రెండు సినిమాలను కూడా ఒప్పుకుంది. ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తోంది పూజ హెగ్డే. 2022లో చూసుకుంటే పూజా హెగ్డే రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలతో తెరి మీదకి వచ్చింది. పూజా హెగ్డే అందం తో అభినయంతో అందరినీ బాగా ఆకట్టేసుకుంది. చాలా మంది సీనియర్ హీరోల సరసన కూడా ఈమె నటించింది. తెలుగు ప్రేక్షకులకి చక్కటి సినిమాలతో దగ్గర అయిపోయింది పూజ హెగ్డే.