Ads
హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన ‘యశోద’ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ‘యశోద’ సినిమా టాక్ ఎలా ఉండబోతుంది… కలెక్షన్స్ ఎలా రాబడుతుంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.
Video Advertisement
అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా ఎక్కువ చెయ్యలేదు చిత్ర టీం. సమంత తన అనారోగ్యం కారణంగా కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ‘యశోద’ కలెక్షన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా అందరిలోనూ పెరిగింది. ప్రేక్షకులు, నెటిజన్లకు మాత్రమే కాదు దర్శకుడు గుణ శేఖర్ కు కూడా ‘యశోద’ రిజల్ట్ పై ఆసక్తి పెరిగినట్టు ఇన్సైడ్ టాక్.
ఎందుకంటే ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ లోనూ తనే హీరోయిన్. కేవలం సమంత ఇమేజ్‌ని నమ్ముకొని తీసిన సినిమాలు ‘యశోద’, ‘శాకుంతలం’. ఈ సినిమాలో ఉన్న ఏకైక స్టార్ సమంత మాత్రమే. సమంతని చూసి జనాలు థియేటర్లకు వస్తారా..రారా.. అనేది ‘యశోద’తో తేలిపోతుంది.
‘యశోద’తో పోలిస్తే.. ‘శాకుంతలం’కి భారీ బడ్జెట్ అయ్యింది. గుణశేఖర్ స్వతహాగానే… మేకింగ్ పై దృష్టి పెడుతుంటాడు. శాకుంతలంలో విజువల్స్‌కి ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.70 కోట్లయినట్టు టాక్. ‘యశోద’ కూడా అటూ ఇటూగా రూ.30 కోట్ల సినిమానే.
సమంత నటించిన ‘యూ టర్న్’కి మంచి రిపోర్ట్ వచ్చినా – బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ‘ఓ బేబీ’ బొటాబొటీ కలక్షన్లతో గట్టెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘యశోద’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘యశోద’ కలక్షన్లే… శాకుంతలం సినిమాకి బిజినెస్ లెక్కలను డిసైడ్ చేస్తాయి. అందుకే గుణశేఖర్ చాలా టెన్షన్ గా యశోద భాక్సాఫీస్ ఫెరఫార్మెన్స్ ని గమనించాల్సిన పరిస్దితి.
End of Article