ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ. ప్రియ పూర్తి పేరు మామిళ్ల శైలజా ప్రియ. 42 ఏళ్ల ప్రియ, 20 మే 1978 లో, బాపట్లలో పుట్టారు. తన తల్లిదండ్రులు శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి మామిళ్ల కుసుమ కుమారి గారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ప్రియ మూడవ వారు. ప్రియ స్కూలింగ్ అంతా హైదరాబాద్ లోనే జరిగింది.Bigg Boss Telugu 5 Priya shares her memory with Nagarjuna

కాలేజ్ లో ఉన్నప్పుడు మిస్ కాలేజ్ టైటిల్ గెలుచుకున్నారు ప్రియ. తర్వాత నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ప్రియ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన ప్రియసఖి సీరియల్ తో సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రియ. అలాగే మాస్టర్, దొంగాట, గోకులంలో సీత, మావిడాకులు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, సూర్యుడు, సుప్రభాతం, రాజకుమారుడు, అన్నయ్య ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.

నటించడం మాత్రమే కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ కూడా చేశారు ప్రియ. కెరీర్ ప్రారంభించిన కొంత కాలంలోనే నంది అవార్డు కూడా అందుకున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు ప్రియ. ప్రియ ఇంస్టాగ్రామ్ లో తన టీం ఒక ఫోటోని షేర్ చేశారు. అందులో ప్రియా బిగ్ బాస్ లో అక్కినేని నాగార్జునని కలిసిన ఎపిసోడ్, అలాగే ఒక సినిమాలో ప్రియ, నాగార్జున కలిసి నటించిన సీన్ కి సంబంధించిన ఫోటో ఉన్నాయి.Bigg Boss Telugu 5 Priya shares her memory with Nagarjuna

ఈ ఫోటో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ హీరో హీరోయిన్లుగా నటించిన చంద్రలేఖ సినిమాలోనిది. ఈ ఫోటో కింద “23 సంవత్సరాల నుండి ఈ మెమొరీ నన్ను ఫాలో అవుతూ బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్ వరకు  తెచ్చింది. థాంక్ యు నాగార్జున గారు” అని రాసి ఉంది. మొదటి వారం బిగ్ బాస్ ఎపిసోడ్ నామినేషన్స్ జరిగాయి. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈవారం ఇంటి నుండి ఎవరు బయటికి వస్తున్నారు అనౌన్స్ చేస్తారు.