RRR తో పాటు ఆస్కార్ గెలుచుకున్న మరొక “భారతీయ సినిమా” గురించి… ఈ విషయాలు తెలుసా..?

RRR తో పాటు ఆస్కార్ గెలుచుకున్న మరొక “భారతీయ సినిమా” గురించి… ఈ విషయాలు తెలుసా..?

by Megha Varna

Ads

నాటు నాటు పాట తో పాటుగా మరొక భారతీయ సినిమా కూడా ఆస్కార్ ని గెలుచుకుంది. బెస్ట్ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ”ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్” ఈ అవార్డు ని సొంతం చేసుకుంది. చాలా మందికి ఈ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ గురించి తెలీదు. మరి దీని వివరాలని చూద్దాం. గునీత్ మోంగ ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ గోన్‌స్లేవ్స్ ఈ షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించారు.

Video Advertisement

ఈ షార్ట్ ఫిల్మ్ తో పాటుగా హాల్ ఔట్‌, మార్తా మిచెల్ ఎఫెక్ట్‌, స్ట్రేంజ‌ర్ ఎట్ ది గేట్‌ కూడా ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. కానీ ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ ఆస్కార్ ని సొంతం చేసుకుంది.

మ‌న దేశం త‌ర‌పున‌ ఈ షార్ట్ ఫిల్మ్ ద‌క్కించుకోవ‌టం ఎంతో గొప్ప విషయం. ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ మ‌దుమ‌లై నేష‌న‌ల్ పార్క్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెర మీద కి వచ్చింది. ఇక ఈ కథ విషయానికి వస్తే.. ”ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్” లో బొమ్మ‌న్‌, బెల్లీ వుంటారు. వీరు ఇద్దరు భార్యా భర్తలు. వీళ్ళు ఒక ఏనుగు పిల్ల ని పెంచుతారు. ఆ ఏనుగు పిల్ల కి ర‌ఘు అని పేరు పెడతారు. ప్రేమానుబందాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపిస్తారు. అలానే దీనిలో అడ‌వి అందాల‌ను ఎంతో అద్భుతంగా చూపించారు. ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ 2022 లో నెట్ ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయ్యింది.

నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి కూడా నామినేట్ అవ్వడం తో ఇండియా అంతా కూడా అవార్డు రావాలని కోరుకుంది. అనుకున్నట్టే నాటు నాటు పాట కి కూడా ఆస్కార్ వచ్చింది. ఈ పాట కి అవార్డు రావడం తో విదేశీ గడ్డపై తెలుగోడి ఖ్యాతి రెపరెపలాడుతోంది. చంద్రబోస్ లిరిక్స్ ని ఇచ్చారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు ఈ పాటని పాడారు.


End of Article

You may also like