“గుంటూరు కారం” తో పాటు ఈ 5 మహేష్ బాబు సినిమాలకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

“గుంటూరు కారం” తో పాటు ఈ 5 మహేష్ బాబు సినిమాలకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ  సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో దాని గురించి చర్చ జరుగుతోంది.

Video Advertisement

అయితే త్రివిక్రమ్‌ చాలా ఇష్టపడే  ‘అ’ సెంటిమెంట్‌ను కూడా పక్కనపెట్టి గుంటూరు కారం అని ఎందుకు పెట్టారని,  మేకర్స్ ఏమనుకుని ఈ టైటిల్ పెట్టారని కొందరు, మూవీ చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుస్తుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ టైటిల్ వెనుక ఉన్న కారణాన్ని నెటిజన్లు వెతికి మరి పట్టుకున్నారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. .
guntur-karam-titleసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. మహేష్ నటిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటనకు మందు నెల రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమూవీ గురించే వినిపించింది. నాలుగైదు టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా వాటిలో నుండి ఒకటి గుంటూరు కారం పేరును మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
mahesh-babu-rare-record2 గ్లింప్స్ లో మహేష్ ను మాస్ స్టైల్ లో చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ గ్లింప్స్ 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ టైటిల్ ఎందుకు పెట్టారని చర్చ మొదలైంది. దానిని నెటిజన్లు డికోడ్ చేశారట. మహేష్‌బాబును షార్ట్‌గా GSSMB అని అంటుంటారు.
ఇక మహేష్‌ బాబు నటిస్తున్న సినిమాతో పాటు వరుస 5 చిత్రాలను తీసుకుంటే, G అంటే గుంటూరు కారం అని, S అంటే సర్కారు వారి పాట అని, S అంటే సరిలేరు నీకెవ్వరు అని, M అంటే మహర్షి అని, B అంటే భరత్ అనే నేను అని లాస్ట్ ఐదు చిత్రాల తొలి అక్షరాలు కలిపితే GSSMB అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారాయి.

Also Read: మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ పోస్టర్స్ లో ఆ పేరు మాయమవడానికి కారణం ఇదేనా..?


End of Article

You may also like