మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ పోస్టర్స్ లో ఆ పేరు మాయమవడానికి కారణం ఇదేనా..?

మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ పోస్టర్స్ లో ఆ పేరు మాయమవడానికి కారణం ఇదేనా..?

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సినిమా వేదాళ‌మ్ కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా  తమన్నా నటిస్తోంది. హీరోయిన్ కీర్తిసురేశ్‌ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది.

Video Advertisement

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే కొన్ని  పోస్టర్స్ విడుదల అయ్యాయి. తాజాగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీని రెండు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ఒక నిర్మాణ సంస్థ కనిపించలేదు. దాంతో ఏమైందా అని ఆరా తీస్తున్నారు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
bhola-shankar-1మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్‌’ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై చేయాలి. అయితే మూవీ ప్రారంభం అవుతుండగా కేఎస్‌ రామారావుకు సంబంధించిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మాణ సంస్థ కూడా ఈమూవీలో భాగం అయ్యింది. దాంతో మూవీ పోస్టర్ల పై రెండు ప్రొడక్షన్ హౌస్ ల పేర్లు కనిపించాయి. కొన్నేళ్ళ నుండి పెద్ద చిత్రాల ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న ఈ సంస్థ ఎందుకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. దానికి సమాధానం రాలేదు.

తాజాగా వచ్చిన భోళా శంకర్ పోస్టర్‌లో సిసి సంస్థ పేరు కనిపించలేదు. దానిపై మళ్లీ కొంతమంది అడిగారు. ఈ సారి ఆ నిర్మాణ సంస్థ సన్నిహితుల నుండి సమాధానం వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2 ప్రొడక్షన్ హౌస్ ల ద్వారానే చేయాలని మొదట అనుకున్నారట. కానీ ఈ సంవత్సరం క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థకు చాలా ప్రత్యేకం. బ్యానర్‌ పెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సినిమాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఈ ఏడాది మరో బ్యానర్‌తో కలసి ఎందుకు సినిమా చేయడం. డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఈ సంవత్సరం మూవీ చేసి 50వ ఏడాదిని ప్రత్యేకం చేసుకుందామని భావించారట. అందువల్లనే ఈ మూవీ పోస్టర్‌లో ఆ సంస్థ పేరు కనిపించలేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ కాబినేషన్ లో ఇప్పటివరకు 5 చిత్రాలు వచ్చాయి. చివరిగా 1991లో రిలీజ్ అయిన ‘స్టూవర్ట్‌ పురం పోలీస్ స్టేషన్‌’  అనే మూవీని చేశారు. మళ్ళీ సినిమా చేస్తే 22 సంవత్సరాల తరువాత చేసినట్లు అవుతుంది.

Also Read: అప్పుడు అమ్మోరు.. ఇపుడు ఆదిపురుష్..! ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

 


End of Article

You may also like