అప్పుడు అమ్మోరు.. ఇపుడు ఆదిపురుష్..! ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

అప్పుడు అమ్మోరు.. ఇపుడు ఆదిపురుష్..! ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది. తాజాగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో జరిగింది.

Video Advertisement

ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన తొలి స్ట్రైట్ సినిమా ఇది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ సినిమా కోసం మూవీ యూనిట్ ఒక పాత తెలుగు సినిమా ఫార్ములాను వాడుతున్నారట. మరి ఆ పాత తెలుగు చిత్రం ఏమిటో? ఆ ఫార్ములా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ammaru-movie-formula-for-adipurushఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆడియెన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆదిపురుష్ థియేట‌ర్లలో ఆ ఒక్క టిక్కెట్ అంటే సీట్ హనుమాన్ కోసం వదిలేస్తారట. ఎందుకంటే రామాయ‌ణ పారాయణం, శ్రీరాముడి కథను కానీ ప్రదర్శించినపుడు అక్క‌డికి హనుమాన్ వ‌స్తాడ‌ని భక్తుల న‌మ్మ‌కం. అందువల్ల ఆ ఒక్క సీటూ అంజనేయుడి కోసం ఉంచేస్తారట.
ఇక థియేట‌ర్ ఫుల్ అయిన ఆ ఒక్క సీటు ఖాళీగా ఉంటే అందరి దృష్టి ఆ ఒక్క సీటు పైనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆ సీట్ లో అంజనేయుడి ప్ర‌తిమ ఉంచినట్లయితే ఆడియెన్స్ అందరు భక్తి మూడ్ లోకి వెళ్తారు. అలా హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్ అంటే మూవీకి ప‌బ్లిసిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 1995 జూన్ 16న రిలీజ్ అయిన ‘అమ్మెరు’ మూవీ సమయంలో కూడా ఇలాంటిది చేశారు. కానీ అది మూవీ యూనిట్  ప్లాన్ చేయలేదు. ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు కలిసి చేశారు. ఆ మూవీ  ప్రదర్శింపబడుతున్న సమయంలో హారతులు పట్టారు. అలాగే థియేట‌ర్ల బ‌య‌ట చిన్న దేవాలయాన్ని కూడా పెట్టారు. పూజలు, ప్ర‌సాదాలు, హుండీల  లాంటివి ఏర్పాటు చేశారు. అమ్మెరు మూవీ అప్పటికే హిట్ అయినా వీటి వల్ల ఆ మూవీ వసూళ్లు మరింతగా పెరిగాయి.

Also Read: “ఆదిపురుష్” ‘ప్రీ-రిలీజ్’ ఈవెంట్ కి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..? కేవలం బాణాసంచా కోసమే..??

 


End of Article

You may also like