విజయ్ దేవరకొండ – సమంత “ఖుషీ” ట్రైలర్‌లో ఇవి గమనించారా..?

విజయ్ దేవరకొండ – సమంత “ఖుషీ” ట్రైలర్‌లో ఇవి గమనించారా..?

by kavitha

Ads

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Video Advertisement

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఖుషి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే పాటలతో అంచనాలను పెంచిన మేకర్స్ ఈ ట్రైలర్ తో ఆకట్టుకున్నారు. అయితే ట్రైలర్ చూసిన నెటిజెన్లు ఇందులో అర్జున్ రెడ్డి మూవీ రిఫరెన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రెండు నిముషాల 45 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ లో విజయ్ దేవరకొండ, సమంత అందంగా కనిపించారు. ఆద్యంతం ఖుషి ట్రైలర్ ఆకట్టుకుంది. సమంత ముస్లింగా, బ్రాహ్మణ యువతిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. విప్లవ్, ఆరాధ్యలు వారి పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని, ఆ తరువాత ఎదుర్కొనే సమస్యలను చూపించారు. అలాగే విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘భర్త ఎలా ఉండాలో చూపిస్తా’, ‘నేను స్త్రీ పక్షపాతిని’, ‘నా పిల్ల’ అనే డైలాగ్స్ బాగున్నాయి.
అయితే ట్రైలర్ లో విజయ్ దేవరకొండ అక్కడక్కడ అర్జున్ రెడ్డి మూవీలోని తన మార్క్ పెర్ఫార్మెన్స్ ను చూపించాడు. ఇక ట్రైలర్ లో చివర్లో విజయ్ దేవరకొండ ఒక మహిళతో ‘ఎందుకు బయపడుతున్నావమ్మా, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు కానీ, నేను స్త్రీ పక్షపాతిని’ అనే డైలాగ్ చెప్పే సీన్ లో ఉన్న నటి అర్జున్ రెడ్డి మూవీలో కూడా ఉంటుంది. అలాగే ‘నా పిల్ల’ అనే డైలాగ్ కూడా అర్జున్ రెడ్డిలో చెప్పిన డైలాగ్. ఈ ట్రైలర్ ను చూసిన నెటిజెన్లు ఈ రెండు విషయాల పై కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: చూడడానికి అచ్చం “రష్మిక మందన్న” లాగానే ఉంది కదా..? ఈమె ఎవరో తెలుసా..?

 


End of Article

You may also like