ఆహా యాప్ లో ఇటీవల విడుదలై విజయం సాధించిన సినిమా కలర్ ఫోటో. ఈ సినిమాలో సుహాస్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. సునీల్, శ్రీవిద్య, వైవా హర్ష, దివ్య, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

# కలర్ ఫోటో సినిమా స్టోరీకి మూలం ప్రొడ్యూసర్ సాయి రాజేష్ జీవితంలో జరిగిన సంఘటన. సాయి రాజేష్ యంగ్ గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి మీద క్రష్ ఉండేదట. కానీ ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పలేకపోయారు. ఒక వేళ చెప్తే, వాళ్లిద్దరికీ మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందో అనే విషయాన్ని రాద్దాం అనుకున్నారు.

ఎప్పుడో అనుకున్న ఈ కథని మళ్లీ సుహాస్ ని చూసిన తర్వాత బయటికి తీశారు. ఈ పాయింట్ దర్శకుడు సందీప్ రాజ్ కి చెప్తే, కొద్ది రోజుల్లోనే కలర్ ఫోటో కథని తీసుకువచ్చారు. ఈ మూవీ షూటింగ్ కేవలం 34 రోజులలో కంప్లీట్ చేశారు.

# ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ చాందిని చౌదరి. మనం చాందిని ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఆ పాత్రలో చాందిని నటిస్తున్నారు అని మర్చిపోతాం. కేవలం మనకి దీపు మాత్రమే కనిపిస్తుంది. కలర్ ఫొటో సినిమా కథని నిహారిక కొణిదెల కి చెబుదామని అనుకున్నారు. కానీ గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్ లో చాందిని ని చూసి తాను హీరోయిన్ పాత్రకు ఎలా అయితే ఊహించుకున్నారో, చాందిని అచ్చం అలాగే ఉన్నారు అని, చాందిని ని హీరోయిన్ గా ఎంపిక చేశారు సందీప్ రాజ్.

# అలాగే ముందు సునీల్ పోషించిన రామరాజు పాత్రని కూడా సందీప్ రాజ్ చేద్దామనుకున్నారు. కానీ తర్వాత సునీల్ ని సంప్రదించారు. రామరాజు, సందీప్ రాజ్ వాళ్ళ తండ్రి పేరు.

# సినిమా మొదట్లో దీపు తండ్రి చనిపోయారు అని ఒక ఫోన్ వస్తుంది. దీపు, తన భర్త ఇండియా కి వస్తారు. కానీ తన తండ్రి చనిపోయినా కూడా దీపు ఏడవదు. అందుకు కారణం దీపు ట్రామా లో ఉంటుంది. చివరిలో జయ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జయ కృష్ణ షర్ట్ చూసి ఏడుస్తుంది దీపు. అంటే దీపు, ట్రామా నుండి బయటికి వచ్చింది అని అర్థం.

అందుకే అంతకు ముందు జయకృష్ణ మొహం తనకి గుర్తు లేదు అంటుంది. కానీ చివరికి పెయింటింగ్ వేయగలుగుతుంది. అలాగే జయ కృష్ణ షర్ట్ చూసినప్పుడు, పక్కనే ఉన్న జయ కృష్ణ తల్లి ఫోటో కూడా చూస్తుంది దీపు. ఒక సందర్భంలో జయ కృష్ణ తో, జయ కృష్ణ కళ్ళు అచ్చం తన తల్లి కళ్ళ లాగా ఉంటాయి అని అంటుంది దీపు. చివరిలో దీపు కూడా అదే మాట అంటుంది.

# సినిమాలో ఒక సీన్ లో హీరో, హీరోయిన్ ఒక బస్టాప్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. బస్టాప్ గోడమీద రాధాకృష్ణుల పెయింటింగ్ ఉంటుంది. రాధాకృష్ణులు పెళ్లి చేసుకోరు. అంటే హీరో హీరోయిన్స్ కూడా కలవరు అనే పాయింట్ ని అలా చూపించారు.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com