ఇదేందయ్యా ఇది!!! “రాజారాణి” సినిమా ఎన్నోసార్లు చూసాను…కానీ ఇది గమనించలేదు.?

ఇదేందయ్యా ఇది!!! “రాజారాణి” సినిమా ఎన్నోసార్లు చూసాను…కానీ ఇది గమనించలేదు.?

by Megha Varna

Ads

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.

Video Advertisement

అలా రాజా రాణి సినిమాలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. సినిమా వచ్చి ఏడు సంవత్సరాలు అయింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

# మొదటి పొరపాటు ఏమిటంటే నయనతార ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో, జై, నయనతార ని మొదటి సారి చూసేది 2008 న్యూ ఇయర్ పార్టీ లో.

 

కానీ తర్వాత నయనతార క్లాస్ లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ల లెక్చరర్ బయటకు వెళ్ళమని చెప్తారు. అప్పుడు బోర్డు మీద 2007 వ సంవత్సరం అని రాసి ఉంటుంది.

 

# ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా లో జై వాడే ఫోన్ నోకియా x2 – 02. కానీ ఈ మోడల్ ఫోన్ 2011లో అనౌన్స్ చేశారు.

 

# ఇప్పుడు చెప్పబోయేది పూర్తిగా తప్పు అని అనలేము. కింద కనిపించే సీన్ గమనించండి. ఇందులో నంబర్ ప్లేట్ నెంబర్ TN 10 W 6516 అని ఉంది.

 

ఇపుడు ఈ నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ చూడండి. అదే నెంబర్ TN 10 W 6516 ఉంది.

 

ఇది పొరపాటు కాదు కానీ, అదే ప్రాపర్టీ ని మళ్ళీ ఉపయోగించారు. ఇందులో తప్పు లేదు. కానీ రెండు వేరు వేరు ఎపిసోడ్స్ లో ఈ పాయింట్ ఉండడం వల్ల కొంచెం ఫోకస్ వెళ్తుంది అంతే. ఒకటి జై తో నయనతార ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం. మరొకటి ఆర్య నజ్రియా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం.

మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు. వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.


End of Article

You may also like