“మహానటి” సినిమాలో ఈ తప్పును గమనించారా? తెలియనివి చాలా చూపించి ఈ తప్పే ఎలా చేసారో?

“మహానటి” సినిమాలో ఈ తప్పును గమనించారా? తెలియనివి చాలా చూపించి ఈ తప్పే ఎలా చేసారో?

by Megha Varna

Ads

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ ‘కీర్తి సురేష్’. ఎంట్రీ తోనే భారీ హిట్ కొట్టింది.పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కనిపించిన అది తీవ్ర నిరాశ పరిచింది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బయో పిక్ ‘మహానటి’. తో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు కీర్తి సురేష్.

Video Advertisement

కీర్తి సురేష్, నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించేలా చేసిన “మహానటి” సినిమాలో ఏ తప్పు జరిగిందా అనుకుంటున్నారా? సావిత్రి గారి నిజ జీవితంలో జరిగిన ఓ సన్నివేశాన్ని సినిమాలో తప్పుగా చూపించారు అని అంటున్నారు సినీ పెద్దలు.

మహానటి సినిమాలో సావిత్రి గారు సినిమా షూటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఎస్ వి రంగారావు గారి పాత్ర పోషించిన మోహన్ బాబు గారు సావిత్రి గారిని తిన్నావా అని అడిగి, భోజనం ఏర్పాటు చేస్తారు. నిజానికి సావిత్రి గారిని అలా అడిగింది గుమ్మడి గారట. కానీ ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాటిక్ లిబర్టీ తో నిజ జీవితంలో జరిగిన సంఘటనని కొంచెం మార్చారట. సావిత్రి గారి జీవితంలో చాలామందికి తెలియని విషయాల్ని ఎంతో శ్రద్దగా తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిన్న విషయాన్ని ఎలా మరిచారు అంటున్నారు కొందరు. వాస్తవానికి ఎస్వీ రంగారావు గారు 1975 లోనే చనిపోయారు. అలాంటిది 1980 లో బతికున్నాట్టు మహానటి సినిమాలో చూపించడం అనేది చారిత్రక తప్పిదం అనే చెప్పాలి.

సినిమాటిక్ లిబర్టీ వలన సినిమాకి ఎటువంటి సమస్య అవ్వదు. అంతేకాకుండా సినిమాల్లో జరిగే పొరపాట్ల వల్ల కూడా సినిమాకి ఎలాంటి ఇబ్బంది అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాన్నిబట్టి ఆడియన్స్ కూడా ఇలాంటి పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు అని, వీటివల్ల నిజంగా సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు అని వదిలేస్తారు అని, ముఖ్య ప్రాధాన్యత కథకి మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పైన చెప్పినట్టు ఎప్పుడైనా కొంతకాలం తర్వాత సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా?” అనిపిస్తుంది అంతే.


End of Article

You may also like