హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.

Video Advertisement

ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది ఏ సినిమా గురించని.  వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా ఏ మాత్రం బోర్ అనిపించదు. పైగా సినిమా మొత్తం మంచి కామెడీతో ఉంటుంది. విక్టరీ వెంకటేష్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేసే కొద్ది మంది హీరోలలో ఒకరు. సరైన పాత్ర వచ్చిందంటే కామెడీ టైమింగ్ ని ఎవరు ఆపలేరు. వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి.

nuvvu naku nachav mistake

వాటిలో నువ్వు నాకు నచ్చావ్ కూడా ఒకటి. విజయ భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో త్రివిక్రమ్ రచన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కోటి అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. మూడు గంటల సినిమా అయినా సరే ఎంతో హాయిగా చూసేయొచ్చు. ఇదిలా ఉంటే సినిమాల్లో తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ అవి కనుక బయట పడ్డాయి అంటే ప్రేక్షకులు ఒక ఆట ఆడేసుకుంటారు. తాజాగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఒక సీన్ లో జరిగిన తప్పు బయటపడింది. మరి నువ్వు నాకు నచ్చిన సినిమా లో జరిగిన తప్పు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

nuvvu naku nachav mistake

మొదట ఆర్తి అగర్వాల్, వెంకటేష్ పక్క పక్కన ఉంటారు. ఆర్తి అగర్వాల్ వెనక్కి తిరిగి వుంటారు. అప్పుడు చూస్తే ఆర్తి అగర్వాల్ జడలో పువ్వు ఉండదు. తర్వాత మళ్ళీ పూర్తిగా వెనక్కి తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు జడలో పువ్వు కనబడుతుంది. సడన్ గా సీన్లోకి పువ్వు వస్తుంది. అందుకే చిన్నచిన్న వాటిని కూడ చూసుకుంటూ ఉండాలి. లేదంటే ఆడియన్స్ ఇలానే ఆడేసుకుంటారు.