ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయ్యింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని భారతదేశం అంతా కూడా ఎంతో ఆసక్తిగా చూసారు. పైగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసి బాగా ఆకట్టుకున్నారు.

Video Advertisement

ఇది ఇలా ఉంటే ఏ సినిమానైనా తెర మీదకి తీసుకు రావాలంటే ఎంతో పెద్ద కష్టం ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసుకుని సినిమాని విడుదల చేస్తూ ఉంటారు.

is rajamouli planning for RRR sequel..??

అన్ని అంశాలని కూడా చూసుకోవాలి. ది బెస్ట్ ఇవ్వడానికే దర్శకులు చూస్తూ వుంటారు. అయితే పెద్ద హిట్ కొట్టిన ఆర్ ఆర్ఆర్ సినిమాలో చాలా తప్పులు ఉన్నాయి. మరి మీరు వీటిని గమనించారా…? సినిమా మొదట్లో చిన్న పాప పాట పాడుతూ బ్రిటిష్ ఆమెకి టాటూ వేస్తుంది. కానీ ఆమె చేతికి ఆల్రెడీ టాటూ ఉంటుంది. దాని మీద ఆమె నెమలికతో టాటూ వేస్తున్నట్లు మాత్రమే చేస్తుంది. ఆమె వేసేది చేతికి అంటుకోదు కూడా.

RRR-telugu adda

అలానే ఈ సినిమా టైటిల్ లో 1920 అని ఉంటుంది అయితే ఓ సన్నివేశంలో మనకి కాయిన్ కనపడుతుంది. అది 1921 కి చెందిన కాయిన్. 1920లో 1921 కి చెందిన కాయిన్ ఎలా వస్తుంది..? ఇది కూడా తప్పే. అలానే చిన్న పాపని తీసుకువెళ్లి పోతున్నప్పుడు వాళ్ళ అమ్మ టైర్లని పట్టుకుంటుంది అప్పుడు ఆమె చేతిలో కాయిన్స్ ఉండవు. మళ్ళీ తర్వాత సీన్లో ఆమె కింద పడిపోయినప్పుడు ఆమె చేతిలో కాయిన్స్ వచ్చేస్తాయి. అప్పుడు లేని కాయిన్స్ ఇప్పుడు ఎలా వచ్చేస్తాయి ఇది కూడా సినిమాలో చూసిన చిన్న మిస్టేక్. పైగా ఆమె పడినప్పుడు ఆమె చేతికి రక్తం ఉండదు. తర్వాత షాట్ లో చూస్తే ఆమె చేతికి రక్తం అంటుకుంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మరి RRR లో ఎటువంటి మిస్టేక్స్ ని చేశారు అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి.