RRR సినిమాలో ఇది గమనించారా..? దీని వెనుక ఇంత కథ ఉందా..?

RRR సినిమాలో ఇది గమనించారా..? దీని వెనుక ఇంత కథ ఉందా..?

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

rrr trailer analysis and hidden details

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా హిట్ అవ్వాలి అంటే దర్శకుడు సీన్స్ రాసే విధానం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో కూడా రాజమౌళి చాలా సీన్స్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అందుకు ఉదాహరణ ఈ సీన్స్. ఇద్దరు హీరోలు మొదటిసారి కలిసినప్పుడు వారిని వారు పరిచయం చేసుకుంటూ చేతులు పట్టుకున్నట్టు చూపిస్తారు.

rrr trailer analysis and hidden details

అప్పుడు ఇద్దరు చేతులు సమానంగా ఉండేలా చూపిస్తారు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ లో రామరాజు చేయి పైన ఉంటే భీమ్ చేయి కిందకి ఉంటుంది. అలాగే వారిద్దరికీ మధ్యలో తాడు ఉంటుంది. అంటే ఇప్పుడు రామరాజు పై చేయిలో ఉన్నాడు అని, అలాగే వారిద్దరికీ మధ్య దూరం ఉంది అని చూపిస్తారు. మళ్ళీ భీమ్ రామరాజుని కాపాడటానికి వెళ్ళినప్పుడు జైల్ లో నుండి రామరాజుని పైకి లేపుతాడు. అప్పుడు కూడా రామరాజు పైకి వచ్చిన తర్వాత ఇద్దరి చేతులు సమానంగా ఉన్నట్టు చూపిస్తారు. అంటే ఇక్కడ ఇద్దరూ కలిసిపోయారు అని చూపించారు. అలా వాళ్ళిద్దరూ ముందు కలిశారు అని, తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల దూరం అయ్యారు అని మళ్ళీ చివరికి కలిశారు అని చూపించారు.

watch video :

https://www.instagram.com/reel/CeoPjZJsvRL/?igshid=YmMyMTA2M2Y%3D


End of Article

You may also like