Ads
రాజకీయాల్లో బిజీ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వకీల్ సాబ్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 3 ప్రాజెక్టులను ఓకే చేసిన పవన్ కళ్యాణ్ వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న ఎన్నికల ప్రచారం కోసం సొంతం గా ఒక వాహనం తయారు చేయించుకున్నారు. ఈ వాహనం పేరు ‘వారాహి’ అంటూ పవన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈహతే ఈ వాహనం రంగు, డిజైన్ వివాదం గా మారింది. ఈ వాహన రిజిస్ట్రేషన్ పనులు తెలంగాణ లో పూర్తయ్యాయి. ఈ వాహనానికి ‘టీఎస్ 13 ఎక్స్ 8384 ‘ అనే నెంబర్ ని కేటాయించారు.
ఈ వారాహి నెంబర్ తెలియగానే పవన్, బన్నీ మధ్య బంధం అంటూ మెగా ఫాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాహనం నెంబర్, పుష్ప లో అల్లు అర్జున్ చెప్పే తన పేజర్ నెంబర్ ఒకటే అని ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే గతం లో కూడా గబ్బర్ సింగ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన జీప్ నెంబర్ 2425 . అదే నెంబర్ ని కూడా అల్లు అర్జున్ డీజే చిత్రం లో స్కూటర్ కి ఉపయోగించారు. దీంతో మామ అల్లుళ్ళ మద్య సింక్ భలే కుదిరిందంటూ ఫాన్స్ ఈ ఫోటోలని నెట్టింట వైరల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి రథాన్ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించనున్నారు. ఈ వాహనానికి పవన్ కళ్యాణ్ ఆర్మీ వాళ్ళు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ కలర్ ని నిబంధనలకు విరుద్ధం గా వినియోగించారని విమర్శలు వచ్చాయి. దానికి తెలంగాణ రవాణా శాఖ అధికారులు బదులిస్తూ అది ఏమిరాల్డ్ గ్రీన్ కలర్ అని.. అందుకే రిజిస్ట్రేషన్ చేశామని పేర్కొన్నారు.
End of Article